Sep 21 2021 @ 10:49AM

'మధుర వైన్స్': ఆకట్టుకుంటున్న 'వెన్నెల క‌న్నెల రేయి' సాంగ్

సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మాతగా జయ కిషోర్ బండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మధుర వైన్స్'. తాజాగా ఈ మూవీ నుంచి విడుదల చేసిన వెన్నెల క‌న్నెల రేయి సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. 'గతం', 'తిమ్మరుసు' లాంటి  చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ అధినేత సృజన్ యారబోలు ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడంతో ఇండస్ట్రీ మ‌రియు ట్రేడ్‌లో ఈ సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి కూడా బాగానే పెరిగింది. ఇప్ప‌టికే ఆడియ‌న్స్‌లో క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సంభందించి 'వెన్నెల క‌న్నెల రేయి' అనే సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఈ సాంగ్ మ‌ద్య‌లో వ‌చ్చే డైలాగ్స్ యూత్‌ని ఆక‌ట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్న ఈ చిత్రాన్ని అతిత్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా ఎస్ ఒరిజిన‌ల్స్ అధినేత సృజన్ యారబోలు మాట్లాడుతూ..  'మా బ్యాన‌ర్ ఎస్ ఒరిజనల్స్ నుంచి త్వ‌ర‌లో 'అద్భుతం', 'పంచతంత్రం' చిత్రాలు కూడా రాబోతున్నాయి. 'మధుర వైన్స్' సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, సాంగ్స్, ట్రైలర్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది, ఈ సినిమా ద్వారా చాలా మంచి ప్రేమని సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూపించ‌బోతున్నాం. హీరో, హీరోయిన్ మద్య‌లో జ‌రిగే స‌న్నివేశాలు యూత్‌ని ఆక‌ట్టుకుంటాయి. ఈ సినిమా నుండి ఇప్ప‌డు విడుద‌ల చేసిన సాంగ్ చూస్తే అంద‌రికి అర్ధ‌మ‌వుతుంది. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ కుమార్, జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం అందించారు. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమా విడుద‌ల‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాం.' అని తెలిపారు.