Jun 16 2021 @ 17:09PM

‘సోని లివ్’ ఓటీటీ తెలుగు కంటెంట్ హెడ్‌గా మధుర శ్రీధర్ రెడ్డి

టాలీవుడ్ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో మంచి పేరున్న సోని సంస్థకు చెందిన ఓటీటీ విభాగం ‘సోని లివ్’ తెలుగు కంటెంట్ హెడ్‌గా దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డిని నియమించింది. ఈ సందర్భంగా సోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ టెలివిజన్, సోని లివ్ కంటెంట్ హెడ్ ఆశిష్ గోల్వాకర్ మాట్లాడుతూ ‘‘‘సోని లివ్’ తెలుగు కంటెంట్ హెడ్గా మధుర శ్రీధర్ రెడ్డిగారు మాతో జాయిన్ అవడం సంతోషంగా ఉంది. తనకున్న అనుభవంతో వీక్షకులకు నచ్చే వైవిధ్యమైన కంటెంట్‌ను ఆయన ‘సోని లివ్’ కు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అన్ని వర్గాల వీక్షకులు ఇష్టపడేలా ‘సోని లివ్’ను శ్రీధర్ రెడ్డి డెవలవ్ చేస్తారని నమ్మకం ఉంది’’ అన్నారు. 


మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘విశ్వవ్యాప్త వినోద రంగంలో సోని ఒక దిగ్గజ సంస్థ. ఇలాంటి సంస్థ ఓటీటీ ‘సోని లివ్’ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. అందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలో ‘సోని లివ్’ కు ఉన్న లెగసీని తెలుగులో మరింత ముందుకు తీసుకెళ్తేందుకు ప్రయత్నిస్తాను. మన తెలుగులోని వైవిధ్యమైన కంటెంట్ ను దేశవ్యాప్తంగా ఆడియెన్స్ ఆదరించేలా తీసుకొస్తాం’’ అన్నారు.