భారత ఆర్మీలోకి Made In India పదాతి దళ యుద్ధ వాహనాలు

ABN , First Publish Date - 2022-06-24T22:08:32+05:30 IST

భారత సైన్యంలోకి ‘మేడిన్ ఇండియా’ పదాతి దళ యుద్ధ వాహనాలు (ICV) వచ్చి చేరాయి. లడఖ్‌లోని లేహ్‌లో

భారత ఆర్మీలోకి Made In India పదాతి దళ యుద్ధ వాహనాలు

లడఖ్: భారత సైన్యంలోకి ‘మేడిన్ ఇండియా’ పదాతి దళ యుద్ధ వాహనాలు (ICV) వచ్చి చేరాయి. లడఖ్‌లోని లేహ్‌లో వీటిని ప్రవేశపెట్టారు. నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) ఓ వాహనాన్ని డ్రైవ్ చేసి పరీక్షించారు. పలువురు జవాన్లు ఆయుధాలతో వాహనంపైకి ఎక్కి కూర్చోగా తొలి రైడ్‌ విజయవంతంగా పూర్తైంది. అనంతరం ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. వాహనాల సామర్థ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వాహనాలను చాలా సులభంగా డ్రైవ్ చేయవచ్చని, డ్రైవర్ 1800 మీటర్ల దూరం వరకు చూడగలుగుతాడని అన్నారు. దానిపై అమర్చిన ఆయుధాన్ని లోపలి నుంచే నియంత్రించవచ్చన్నారు.

 

ఈ వాహనాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), టాటా గ్రూప్ (Tata Group) కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. లడఖ్‌లో కార్యాచరణ సంసిద్ధతపై సమీక్ష నిర్వహించేందుకు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ ద్వివేదీ సోమవారమే ఇక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దళాల కార్యాచరణ సంసిద్ధత, శిక్షణ, సరికొత్త ఆయుధ వ్యవస్థ, పరికరాలు, లాజిస్టిక్స్ వంటివాటిపై సమీక్ష నిర్వహించారు. 



Updated Date - 2022-06-24T22:08:32+05:30 IST