ఇళ్లలో తయారుచేసుకున్న మాస్క్‌ల పనితీరు భేష్ !

ABN , First Publish Date - 2020-09-20T12:14:37+05:30 IST

కరోనా నేపథ్యంలో చాలామంది ఇళ్లల్లో మాస్క్‌లను కుట్టించుకొని వాడుతున్నారు.

ఇళ్లలో తయారుచేసుకున్న మాస్క్‌ల పనితీరు భేష్ !

వాషింగ్టన్‌, సెప్టెంబరు 19 : కరోనా నేపథ్యంలో చాలామంది ఇళ్లల్లో మాస్క్‌లను కుట్టించుకొని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి పనితీరు ఎలా ఉంది ? అవి వైరస్‌ బెడద నుంచి కాపాడగలుగుతాయా ? అనేది తెలుసుకునేందుకు ఇలినాయిస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. 11 రకాల వస్త్రాలతో తయారయ్యే మాస్క్‌ల పనితీరును, మెడికల్‌ మాస్క్‌ ప్రమాణాలతో పోలుస్తూ పరిశీలన జరిపారు. ఇళ్లలో తయారైన మాస్క్‌లు ఒకవేళ సింగిల్‌ లేయర్‌లోనే ఉన్నా.. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే పెద్దపెద్ద (100 నానోమీటర్ల) నీటి తుంపరలను కూడా సమర్ధంగా నిరోధించగలుగుతున్నట్లు గుర్తించారు. టీ-షర్ట్‌ వస్త్రం వంటి వాటితో రెండు లేదా మూడు లేయర్లతో తయారుచేసే మాస్క్‌లు.. మెడికల్‌ మాస్క్‌కు దీటైన రక్షణను కల్పిస్తాయని వెల్లడించారు.


Updated Date - 2020-09-20T12:14:37+05:30 IST