ఇంట్లోనే హెయిర్‌ప్యాక్స్‌

ABN , First Publish Date - 2021-07-10T17:57:44+05:30 IST

చక్కని కేశ సౌందర్యం ఉండాలంటే కేవలం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్‌ వాడితేనే సరిపోతుంది అనుకోకూడదు. మన ఇంట్లోనే దొరికే వాటితోనే హెయిర్‌ ప్యాక్స్‌ చేసుకోవచ్చు. సహజసిద్దమైన పదార్థాలను జుట్టుకు పట్టిస్తే చాలు.

ఇంట్లోనే హెయిర్‌ప్యాక్స్‌

ఆంధ్రజ్యోతి(10-07-2021)

చక్కని కేశ సౌందర్యం ఉండాలంటే కేవలం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్‌ వాడితేనే సరిపోతుంది అనుకోకూడదు. మన ఇంట్లోనే దొరికే వాటితోనే హెయిర్‌ ప్యాక్స్‌ చేసుకోవచ్చు. సహజసిద్దమైన పదార్థాలను జుట్టుకు పట్టిస్తే చాలు. 


మందారం ఆకులతో జుట్టును కాపాడుకోవడం సహజమైన ప్రక్రియ. పూర్వం నుంచీ కేశ సౌందర్యం కోసం మందారాల్ని వాడుతున్నారు. మందారం పూలను మెత్తగా చూర్ణం చేసి.. దానిలోకి సరిపోయేంత ఆలివ్‌ ఆయిల్‌ లేదా ఆముదం వేసి మిశ్రమంగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఆరిపోయాక చల్లటి నీటితో స్నానం చేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది. ఒకవేళ ఆలివ్‌ ఆయిల్‌, ఆముదం లేకపోతే మందారం పువ్వును కొంచెం నీళ్లు వేసి మెత్తగా పేస్టు చేసుకుని పెట్టుకోవచ్చు. మందారం పువ్వును మెత్తగా నూరి, అందులోకి శనగపిండి, పెరుగు వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.


ఒక గ్లాసులో కొన్ని పాలు తీసుకుని, ఒక టేబుల్‌ స్పూను తేనె కలపాలి. బాగా మిక్స్‌ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఆరిన తరువాత జుట్టును మంచి నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారానికి ఓ సారి చేసి చూడండి. చక్కటి ఫలితం కనపడుతుంది. 


పచ్చికొబ్బరిని గ్రైండ్‌ చేస్తే పాలు మాదిరి అవుతాయి. ఈ కొబ్బరి పాలను కాస్త గోరువెచ్చగా చేసి కుదుళ్లకు పట్టించాలి. మెల్లగా జుట్టుకు పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. దీనివల్ల మీ జుట్టు పొడిగా తయారవుతుంది.

Updated Date - 2021-07-10T17:57:44+05:30 IST