‘మా బేకరిలో ముస్లింలు పనిచేయట్లేదు’ అని ప్రకటించి చివరికిలా..

ABN , First Publish Date - 2020-05-11T18:18:37+05:30 IST

జైన సముదాయం తయారు చేసిన ఆహార పదార్ధాలని, ముస్లింలు ఎవరూ పనిచేయలేదంటూ

‘మా బేకరిలో ముస్లింలు పనిచేయట్లేదు’ అని ప్రకటించి చివరికిలా..

చెన్నై : జైన సముదాయం తయారు చేసిన ఆహార పదార్ధాలని, ముస్లింలు ఎవరూ పనిచేయలేదంటూ ప్రకటన చేసిన బేకరీ యజమానిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక టి.నగర్‌ మహాలక్ష్మి వీధికి చెందన ప్రశాంత్‌ జైన్‌ బేకరీస్‌ అండ్‌ కన్ఫెక్షనరీస్‌ అనే పేరుతో బేకరీ నడుపుతున్నాడు. ఆన్‌లైన్‌ లో కూడా ఆహార పదార్ధాలను విక్రయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, ప్రశాంత్‌ తన వాట్సాప్‌ గ్రూపులో బేకరీ గురించి చేసిన ప్రకటనలో... ‘మేడ్‌ బై జైన్స్‌ ఆన్‌ ఆర్డర్స్‌, నో ముస్లిం స్టాఫ్‌’ అంటూ పేర్కొన్నాడు. ఈ ప్రకటన ముస్లింలను కించపరిచేలా ఉందని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ విషయమై కేసు నమోదుచేసి విచారించిన పోలీసులు రెండు సెక్షన్ల కింద ప్రశాంత్‌ను విచారించగా, ముస్లింల ద్వారా కరోనా వైరస్‌ ప్రబలుతున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు రావడంతో జైనులు ఆందోళన చెంది తన బేకరీలో ఆహార పదార్ధాల కొనుగోలుకు ఎవ్వరు రావడం లేదన్నారు. అందుకే ఇలాంటి ప్రకటన చేశానని అంగీకరించాడు. దీంతో అతడిని  మందలించిన పోలీసులు స్టేషన్‌ జామీనుపై విడుదల చేశారు.

Updated Date - 2020-05-11T18:18:37+05:30 IST