Abn logo
Aug 15 2020 @ 17:43PM

‘మ్యాడి అనే మాధవ్‌’ ఫస్ట్ లుక్, సాంగ్ విడుదల

తెలుగు సహా తమిళం, మలమాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆన్మే క్రియేషన్స్‌ పతాకంపై అనిల్‌కుమార్‌ నిర్మిస్తున్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘మ్యాడి అనే మాధవ్‌’. తమిళంలో ‘మ్యాడి ఎంగిర మాధవన్‌’, హిందీలో ‘మేరా ఇండియా’గా విడుదల చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఈ సినిమాలో ‘ముచ్చటైన మువ్వన్నెల జెండా...’ పాటతో పాటు తెలుగు వెర్షన్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. నిర్మాత అనిల్‌కుమార్‌ కథ అందించిన ఈ చిత్రంతో ప్రతీష్‌ దీపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


ఈ సందర్భంగా చిత్రరచయిత, నిర్మాత అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘పంద్రాగస్టుకు దేశభక్తి గీతాన్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజే ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశాం. తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గొప్ప ఆలోనలు, ధైర్యసాహసాలు కలిగిన నిరుపేద చిన్నారి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే కాన్సెప్ట్‌ కావడంతో పాన్‌–ఇండియన్‌ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నాం. దక్షిణాది భాషలకు, హిందీకి వేర్వేరు నటీనటులను తీసుకున్నాం. చిత్రీకరణ సైతం వేర్వేరుగా చేస్తున్నాం. కొందరు నటీనటులు అన్ని భాషల్లో కనిపిస్తారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన హీరోలు ప్రభు, అదిత్‌ అరుణ్‌, ‘నువ్వే కావాలి’ ఫేమ్‌ రిచా కీలక పాత్రల్లో నటించారు. ‘మాస్టర్‌’ అంజయ్‌ ప్రధాన పాత్ర పోషించాడు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement