తిరుపతి(కొర్లగుంట) : తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి సోమవారం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. మాతృభాష తెలుగులో ప్రమాణం చేయడం ద్వారా సహచర ఎంపీలను ఆకట్టుకున్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుకు, ఉపాధి హామీ పనులకు నిధులు కేటాయించాలని అభ్యర్థించారు.