మద్దాళికి విశ్వ కళావిభూషణ్‌ సత్కారం

ABN , First Publish Date - 2021-04-13T05:53:41+05:30 IST

శ్రీ అభయకళారాధన సాంస్కృతిక సేవాసమితి అధ్యక్షుడు మద్దాళి మాధవరావును హైదరాబాదుకు చెందిన సకళ కళా ఆర్ట్స్‌ వారు విశ్వ కళావిభూషణ్‌ బిరుదుతో ఘనంగా సత్కరించారు. స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులోని పేస్‌ పబ్లిక్‌ స్కూలులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొని సన్మానపత్రం, మెమెంటో, బంగారు కిరీటాన్ని మద్దాళికి బహూకరించారు.

మద్దాళికి విశ్వ కళావిభూషణ్‌ సత్కారం
పురస్కారం అందిస్తున్న మేయర్‌ గంగాడ సుజాత


ఒంగోలు (కల్చరల్‌), ఏప్రిల్‌ 12 :
శ్రీ అభయకళారాధన సాంస్కృతిక సేవాసమితి అధ్యక్షుడు మద్దాళి మాధవరావును హైదరాబాదుకు చెందిన సకళ కళా ఆర్ట్స్‌ వారు విశ్వ కళావిభూషణ్‌ బిరుదుతో ఘనంగా సత్కరించారు. స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులోని పేస్‌ పబ్లిక్‌ స్కూలులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొని సన్మానపత్రం, మెమెంటో, బంగారు కిరీటాన్ని మద్దాళికి బహూకరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి బుచ్చేశ్వరరావు, పలు సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు, కళాకారులు పాల్గొని మద్దాళిని అభినందించారు. 

Updated Date - 2021-04-13T05:53:41+05:30 IST