Madapur కాల్పుల కేసులో కొత్త కోణం

ABN , First Publish Date - 2022-08-01T15:16:21+05:30 IST

మాదాపూర్ కాల్పుల కేసు(Madapur Firing case)లో కొత్త కోణం వెలుగు చూసింది.

Madapur కాల్పుల కేసులో కొత్త కోణం

Hyderabad : మాదాపూర్ కాల్పుల కేసు(Madapur Firing case)లో కొత్త కోణం వెలుగు చూసింది. తాడ్‌బండ్‌లోని 250 గజాల భూమి విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఈ భూమిని కొన్నాళ్ల క్రితమే మహ్మద్ పేరుపై రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారి ఇస్మాయిల్ గిఫ్ట్ డీడ్ చేశాడు. వివాద పరిష్కారం కోసం ఇస్మాయిల్‌ను మహ్మద్(Mohammad) మాదాపూర్‌కు పిలిచాడు. ఇస్మాయిల్, మహ్మద్ మాట్లాడుతుండగా జిలానీ(Jilani) కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్‌పై కంట్రిమేడ్ వెపన్‌(Country made weapon)తో 6 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటనలో ఇస్మాయిల్‌ మృతి చెందగా.. అతనితో పాటు ఉన్న జహంగీర్‌కు గాయాలయ్యాయి. మహ్మద్‌కు జిలానీ రైట్ హ్యాండ్‌గా ఉన్నాడని తెలుస్తోంది. ఈ ఘటనపై జహంగీర్ మాట్లాడుతూ.. ‘‘మహ్మద్-ఇస్మాయిల్ మధ్య భూ వివాదం ఉంది. నిన్న రాత్రి మహ్మద్ కాల్ చేశాడు. మాదాపూర్‌కు నేను, ఇస్మాయిల్, అక్బర్ వెళ్లాం. మహ్మద్, ఇస్మాయిల్ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇస్మాయిల్‌పై ఒక్కసారిగా ఫైర్ ఓపెన్ చేశారు. అడ్డుకునేందుకు వెళ్తే నాపై జిలానీ కాల్పులు జరిపాడు’’ అని వెల్లడించాడు.




Updated Date - 2022-08-01T15:16:21+05:30 IST