పిచ్చికుక్కల స్వైరవిహారం

ABN , First Publish Date - 2022-08-03T06:00:04+05:30 IST

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో పది మందిని గాయపరిచాయి. అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అంబుసోలి, పద్మనాభపురం, శాంతినగర్‌, ప్రకాశరావునగర్‌, ఇందిరానగర్‌, ఉదయపురం కాలనీల్లో ఓ కుక్క హల్‌చల్‌ చేసింది. అక్కుపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న సయద్‌ ఇస్మాయల్‌ అనే విద్యార్ధి పాఠశాలకు వెళ్తుండగా దాడి చేసి

పిచ్చికుక్కల స్వైరవిహారం
గాయపడిన బాధితులు



పది మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

పలాస, ఆగస్టు 2: పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో పది మందిని గాయపరిచాయి. అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  అంబుసోలి, పద్మనాభపురం, శాంతినగర్‌, ప్రకాశరావునగర్‌, ఇందిరానగర్‌, ఉదయపురం కాలనీల్లో ఓ కుక్క హల్‌చల్‌ చేసింది. అక్కుపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న సయద్‌ ఇస్మాయల్‌ అనే విద్యార్ధి పాఠశాలకు వెళ్తుండగా దాడి చేసి  గాయపరిచింది.తల వెనుకభాగం తీవ్ర గాయం కాగా, కంటిపై కరవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటు తరువాత అంబుసొలికి చెందిన పిలక వసంతు అనే వ్యక్తిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచింది. స్థానికులు కర్రలతో అదమడంతో వీధుల్లోకి వెళ్లింది. కనిపించిన వారందరిపై దాడిచేసింది. కుక్క దాడిలో పి.కుమారస్వామి, మెట్టూరు ప్రత్యూష, డి.గోవింద్‌, టి.వినోద్‌కుమార్‌, ఎ.పద్మ, ఎస్‌.బాలరాజు, బి.చిట్టెమ్మలు గాయాలపాలయ్యారు. వారంతా ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పిలక వసంతు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పెదంచలలో కుక్క దాడిలో కె.ఈశ్వరి, టి.ప్రవీణ్‌ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులను మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, వైస్‌చైర్మన్‌ మీసాల సురేష్‌బాబులు పరామర్శించారు.




Updated Date - 2022-08-03T06:00:04+05:30 IST