పిచ్చికుక్క దాడి

ABN , First Publish Date - 2022-08-01T05:17:00+05:30 IST

ఓ శునకం ఒక్కసారిగా రక్కసిగా మారింది. పిచ్చిపట్టిన ఆ గ్రామసింహం కాస్త వికృతరూపం దాల్చి జనంపై విరుచుకుపడింది. బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లిలో ఏడుగురిని, మండలంలోని అలజంగిలో ఏడుగురిని, రంగరాయపురంలో ఐదుగురిని, జగన్నాథపురం ఇంకొంతమందిని ఇలా వివిధ ప్రాంతాల్లో ఆదివారం స్వైరవిహారం చేసి 53 మందిని కురిచేసింది.

పిచ్చికుక్క దాడి
గాయపడ్డ బాలుడు


53 మందికి గాయాలు
భీతిల్లిన జనం
బొబ్బిలి, జూలై 31:
ఓ శునకం ఒక్కసారిగా రక్కసిగా మారింది. పిచ్చిపట్టిన ఆ గ్రామసింహం కాస్త  వికృతరూపం దాల్చి జనంపై విరుచుకుపడింది. బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లిలో ఏడుగురిని, మండలంలోని అలజంగిలో ఏడుగురిని, రంగరాయపురంలో ఐదుగురిని, జగన్నాథపురం ఇంకొంతమందిని ఇలా వివిధ ప్రాంతాల్లో ఆదివారం స్వైరవిహారం చేసి 53  మందిని కురిచేసింది. కనబడినవారందరినీ కాటు వేయడంతో స్థానికులంతా భీతిల్లిపోయారు. గొల్లపల్లిలో  ఓ వృద్ధురాలిని కరవడంతో  తీవ్ర రక్త స్రావమైంది.  చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఇలా కుక్కకాటు బారినపడ్డారు. ఒకేసారి ఇంతమందిని పిచ్చికుక్క కరవడంతో పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారందరూ తీవ్ర భయాందో ళనలకు గురయ్యారు. వీధుల్లో ఆడుకునే పిల్లలందరినీ ఇళ్లల్లోకి తీసుకుపోయి అప్రమత్తమయ్యారు.  కొందరు వ్యక్తులు ఆ కుక్కను వెంబడించి కొట్టి చంపేశారు. గాయపడ్డ వారందరూ బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా వైద్యులు వారికి యాంటీ ర్యాబిస్‌ ఇంజక్షన్లు ఇచ్చారు. ఇటీవలే ఆసుపత్రికి వ్యాక్సిన్‌ వచ్చిందని, 300 డోసుల వరకు సిద్ధంగా ఉన్నాయని సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ జి.శశిభూషణరావు తెలిపారు.


Updated Date - 2022-08-01T05:17:00+05:30 IST