రాచర్ల హైస్కూలులో మాక్ పార్లమెంటు నిర్వహిస్తున్న విద్యార్థులు
రాచర్ల, జనవరి 2: రాచర్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మాక్ పార్లమెంటు కార్యక్రమంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలల ఉపాధ్యాయురాలు సుజాత విద్యార్థులతో పార్లమెంటు సభ్యులు ఎంతమంది, అధికార ప్రతిపక్ష పాత్ర ఏమిటి, ప్రతిశాఖకు మంత్రులు చేసే పనులు ఏవి, వారికి ప్రశ్నలు, సమాధానాల గురించి కార్యక్రమం నిర్వహించడమే కాకుండా స్పీకర్ విధులను వివరించారు.