మచిలీపట్నంలో మంటగలిసిన మానవత్వం

ABN , First Publish Date - 2022-04-03T20:36:05+05:30 IST

ఇంటికి వెలుగునిచ్చే చిట్టితల్లులు భూమ్మీదకు రాకుండానే కాలగర్భంలో కలిసి పోతున్నారు. ఎలాంటి నేరం చేయకపోయినా

మచిలీపట్నంలో మంటగలిసిన మానవత్వం

విజయవాడ: ఇంటికి వెలుగునిచ్చే చిట్టితల్లులు భూమ్మీదకు రాకుండానే కాలగర్భంలో కలిసి పోతున్నారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఓ నవజాత శిశువు పురిటి నెత్తురు ఆరకుండానే చీకట్లో కలిసిపోయింది. ఈ అమానుష ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగింది. నాగులేరు మంచినీటి కాలువలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం స్థానికుల కంట పడింది. పురిటి పేగులతో సహా శిశువును కాలువలో పడేశారు. శిశువు మృతదేహాన్ని చూసి సచివాలయ సిబ్బందికి స్థానికులు  సమాచారం ఇచ్చారు. సచివాలయ అధికారుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. శిశువును కాలువలో నుంచి పోలీసులు బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిశువును ఎవరు కాలువలో ఎవరు పడేసారనే దానిపై విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2022-04-03T20:36:05+05:30 IST