ఎం2 ప్రాసెసర్‌తో మేక్‌బుక్‌ ఎయిర్‌

ABN , First Publish Date - 2022-06-11T05:40:49+05:30 IST

యాపిల్‌ కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఎం2 ప్రాసెసర్‌తో మేక్‌బుక్‌ ప్రొ విడుదలైంది. ఇది నాలుగు రంగుల్లో లభ్యమవుతోంది.

ఎం2 ప్రాసెసర్‌తో మేక్‌బుక్‌ ఎయిర్‌

యాపిల్‌ కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఎం2 ప్రాసెసర్‌తో మేక్‌బుక్‌ ప్రొ విడుదలైంది. ఇది నాలుగు రంగుల్లో లభ్యమవుతోంది. సిల్వర్‌, స్పేస్‌ గ్రే, స్టార్‌లైట్‌, మిడ్‌నైట్‌ రంగుల్లో ఉన్న వచ్చే నెల నుంచి యాపిల్‌ స్టోర్‌లో అందుబాటులోకి రానున్నాయి. 13 ఇంచీల ప్రొ రెటీనీ డిస్‌ప్లేకు తోడు 500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. ఇంతకుమునుపు వాటితో పోల్చుకుంటే పాతిక శాతం ఎక్కువ బ్రైట్‌నెస్‌ ఇది కలిగి ఉందని యాపిల్‌ చెబుతోంది. 11.3 మి.మీ మందం, 2.7 పౌండ్ల భారం కలిగి ఉంది. వివిధ యాక్సెసరీలను కనెక్ట్‌ చేసేందుకు రెండు థండర్‌బోల్ట్‌ పోర్ట్స్‌ ఉన్నాయి. 3.5 ఆడియో జాక్‌ సపోర్ట్‌ ఉంది. 108పీ ఫేస్‌టైమ్‌ హెచ్‌డి కెమెరా ఉంది. నాలుగు స్పీకర్లతో సౌండ్‌ సిస్టమ్‌ని అమర్చారు. 35వాట్స్‌ పవర్‌ అడాప్టర్‌, రెండు యూఎస్‌బీ-సీ పోర్ట్సు ఉన్నాయి. అంటే దీంతో రెండు డివైస్‌లను ఒకేసారి చార్జింగ్‌ చేసుకోవచ్చు. కేవలం అరగంటలో సగం మేర చార్జింగ్‌ పూర్తవుతుంది. 


ఎంట్రీ లెవెల్‌ మేక్‌బుక్‌

మేక్‌బుక్‌ ఎయిర్‌కు తోడు ఎంట్రీ లెవెల్‌ మేక్‌ బుక్‌ ప్రొ ని కూడా యాపిల్‌ లైన్‌లో నిలుచోబెట్టింది. ఇది కూడా ఎం2 ప్రాసెసర్‌ కలిగి ఉన్నదే. 13 ఇంచీల ఈ డివైస్‌ ధర రూ.1.29,000 కాగా విద్యార్థులకు రూ. పదివేలు తగ్గించి ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. 8 కోర్‌ అలాగే 10 కోర్‌ సీపీయూతో వస్తోంది. యాప్స్‌ విషయంలో ఇది 40 శాతం ఎక్కువ వేగం కలిగి ఉంటుంది. 24 జీబీ వరకు యూనిఫైడ్‌ మెమరీ సపోర్ట్‌ కలిగి ఉంది. 20గంటల సేపు వీడియో ప్లే బ్యాక్‌ సదుపాయంతో బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. ఎన్‌కోడింగ్‌, డీకోడింగ్‌ యాక్సిలిరేటెడ్‌ హార్డ్‌వేర్‌ కోసం నెక్స్ట్‌ జనరేషన్‌ మీడియా ఇంజిన్‌, శక్తిమంతమైన ప్రొ రెస్‌ వీడియో ఇంజిన్‌ని కూడా జతచేసింది. ఇంతకుమునుపుతో పోల్చుకుంటే ఇప్పుడు 4కే, 8కే వీడియోల స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చు. అయితే యాపిల్‌ దీని డిజైన్‌ను ఏమాత్రం మార్చలేదు. అంటే థండర్‌బోల్డ్‌ పోర్ట్సును ఇక్కడ చెప్పుకోవాలి. 500 నిట్స్‌ మేరకు డిస్‌ప్లే ఉంటుంది. 256 జీబీ ఎఎస్‌డి, 512 జీబీ ఎస్‌ఎస్‌డి, ఒక టీబీ ఎస్‌ఎస్‌డి, 2టీబీ ఎస్‌ఎస్‌డి అంటే నాలుగు స్టోరేజ్‌ వేరియంట్స్‌తో లభ్యమవుతుంది. అలాగే కెమెరా కూడా 720పి హెచ్‌ రిజల్యూషన్‌ కలిగి ఉంది. 

Updated Date - 2022-06-11T05:40:49+05:30 IST