‘అఖండ’ కెమెరామెన్‌‌పై ‘మాయోన్‌’ టీమ్ ప్రశంసల వర్షం.. ఎందుకంటే?

ఇటీవల తెలుగులో విడుదలై ఘన విజయం సాధించిన ‘అఖండ’ చిత్రానికి కెమెరామన్‌గా పనిచేసిన రాంప్రసాద్‌ కెమెరా పనితనానికి, ప్రతిభకు అనేక మంది సినీ సెలెబ్రిటీలు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘అఖండ’ చిత్రంలో స్టార్‌ హీరో బాలకృష్ణ హీరోగా నటించగా, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా రాంప్రసాద్‌ పనిచేశారు.


‘అఖండ’ ఘన విజయానికి ఆ చిత్రం విజువల్స్‌ కూడా ఓ కారణంగా అనేక మంది సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తన ప్రతిభతో ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా షూట్‌ చేసి ఎంతో రిచ్‌గా కనిపించేలా చేశారంటూ కితాబిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంప్రసాద్‌ ఇపుడు ‘మాయోన్‌’ అనే తమిళ చిత్రానికి కెమెరామెన్‌‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. రాంప్రసాద్‌ కెమెరా పనితనం, ఒక సన్నివేశం బాగా రిచ్‌గా వచ్చేందుకు తీసుకునే శ్రద్ధ, పడే కష్టం గురించి తెలియజేస్తూ.. అటు ‘అఖండ’, ఇటు ‘మాయోన్‌’ చిత్ర బృందాలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement