సత్యరాజ్ కుమారుడు సిబి సత్యరాజ్ (Sibi satyaraj)హీరోగా కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మాయోన్’ (Maayon movie). తాన్యా రవిచంద్రన్ కథానాయిక. ఈ చిత్రం తెలుగు అనువాద హక్కుల్ని మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ఈ నెల 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో సూపర్‌హిట్ కావాలి అని రచయిత కె.విజయేంద్రప్రసాద్ అన్నారు. (Maayon movie pre release)
‘‘పురాతన దేవాలయానికి సంబంధించిన రహస్య పరిశోధన నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్‌గా సాగే చిత్రమిది. విజువల్ వండర్లా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నాం. ఇళయరాజా గారితో వర్క్ చేయడం మా అదృష్టం’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘ఇందులో ఆర్కియాలజిస్ట్‌గా నటించాను. హీరోగా నాకు మంచి గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది’’ అని హీరో శిబిరాజ్ (Sibi raj)అన్నారు. ‘‘తెలుగు ప్రేక్షకుల నన్ను ఎంతగానో ఆదరించారు. అలాగే నా బిడ్డ శిబిని కూడా ఆదరిస్తారని, తన సినీ కెరీర్ బావుండాలని కోరుకుంటున్నా. ఈ సినిమా చూశా. ఆద్యంతం ఉత్కంఠగా అనిపించింది’’ అని సత్యరాజ్ అన్నారు.