Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మాగాయ

మాగాయ

కావలసినవి: పల్లటి పచ్చిమామిడికాయ ముక్కలు - నాలుగు కప్పులు, ఉప్పు - అరకప్పు, పసుపు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - అరకప్పు, మెంతిపొడి - మూడు టీస్పూన్లు, నూనె - ముప్పావుకప్పు, ఆవాలు - మూడు టీస్పూన్లు, ఎండుమిర్చి - నాలుగు, ఇంగువ - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా మామిడికాయ ముక్కలను చిన్న ముక్కలుగా తరుగుకుని ఉప్పు, పసుపు వేసి రెండు రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మూడో రోజు ముక్కలు విడిగా, రసం విడిగా ఎండలో పెట్టాలి. ఆరేడు గంటలు ఎండిన తరువాత ముక్కలు రసం కలుపుకోవాలి. కారం వేయాలి.స్టవ్‌ పై బాణలి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ వేయాలి. ఈ పోపును పచ్చడిలో కలుపుకోవాలి. వారం రోజుల తరువాత పచ్చడి ఊరి ముక్క మెత్తబడుతుంది. అప్పుడు పచ్చడి రుచిగా ఉంటుంది. 


మెంతికాయమెంతికాయపచ్చ ఆవకాయపచ్చ ఆవకాయఆవకాయఆవకాయతొక్కుడు ఊరగాయతొక్కుడు ఊరగాయమామిడికాయ పచ్చడిమామిడికాయ పచ్చడికొత్తిమీర చట్నీకొత్తిమీర చట్నీక్యారెట్‌ పచ్చడిక్యారెట్‌ పచ్చడిపుదీనా పెరుగు చట్నీపుదీనా పెరుగు చట్నీకొత్తిమీర చట్నీకొత్తిమీర చట్నీఖట్టా మీఠా చట్నీఖట్టా మీఠా చట్నీ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.