Oct 9 2021 @ 21:02PM

ఫ్యాన్స్‌తో నాగబాబు అంకుల్ ఏం చేయిస్తారో నాకు తెలుసు: విష్ణు

మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యలపై మంచు విష్ణు స్పందించారు. అభిమానులతో నాగబాబు అంకుల్ ఏం చేయిస్తారో తనకు తెలుసన్నారు. వ్యక్తిగతంగా తన ఫ్యామిలీ విమర్శిస్తున్నారని మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థిగా ఉన్న తనను విమర్శించొచ్చని, కానీ  కుటుంబాల జోలికి వెళ్లొద్దని సూచించారు. నాగబాబు అంకుల్‌కు వరుణ్‌తేజ్‌ ఎంతో తానూ అంతేనని చెప్పారు. అందరం ఒక కుటుంబమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని విష్ణు హితవు పలికారు.


‘‘మిమ్మల్ని ఏమైనా అంటే.. మీ అభిమానులతో మీరు ఏం చేయిస్తారో కూడా తెలుసని, రాజశేఖర్-జీవిత కార్లపై అభిమానులతో ఎలా దాడి చేయించారో తెలియదనుకుంటున్నారా?. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలను. కానీ నాకు సంస్కారం ఉంది. దయచేసి దిగజారి మాట్లాడకండి’’ అంటూ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుదు ఇండస్ట్రీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఇంకా మంచు విష్ణు ఏమన్నారో పై వీడియోలో చూడవచ్చు.