Abn logo
Jan 16 2021 @ 14:25PM

`గో కరోనా` అంటున్న `జాంబీ రెడ్డి`!

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం `జాంబీ రెడ్డి`. భారతదేశపు తొలి జాంబీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే నెల 5న విడుదల కాబోతోంది. బాలనటుడిగా పలు సినిమాలు చేసిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్లు. ఇప్పటికే విడుదలైన `జాంబీ రెడ్డి` ఫస్ట్ బైట్, బిగ్ బైట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 


తాజాగా ఈ చిత్రంలోని `గో కరోనా` సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. `ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటమా.. రోడ్లన్నీ ఖాళీగా ఉంటే రాక ఉంటమా.. ఎవడెన్ని చెప్తా ఉన్నా మేము వింటమా.. మా వీపు పగిలే వరకు మానుకుంటమా` అంటూ సాగిన ఈ పాట లాక్‌డౌన్ నాటి పరిస్థితులను కళ్లకు కట్టింది. మార్క్ కే రాబిన్ స్వరపరిచిన ఈ పాటను అనుదీప్, శ్రీకృష్ణ, మార్క్ కే రాబిన్ కలిసి ఆలపించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. 


Advertisement
Advertisement
Advertisement