కండోమ్‌తో రిపేర్ చేసి..పతకం గెలిచింది..!

ABN , First Publish Date - 2021-07-30T03:19:50+05:30 IST

కనూయింగ్ పోటీల్లో పతకం గెలుచుకున్న ఆమె..కొన్ని సందర్భాల్లో తన బోటును(ఇంగ్లిష్‌లో కయాక్ అని పిలుస్తారు) ఎలా రిపేర్ చేసిందీ రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం నెటిజన్లు అవాక్కవుతున్నారు.

కండోమ్‌తో రిపేర్ చేసి..పతకం గెలిచింది..!

ఇంటర్నెట్ డెస్క్: ఒలింపిక్స్ పాల్గొనడమంటేనే ఓ అదృష్టం! ఇక ఈ గ్లోబల్ స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు కోసం చివరికంటా శ్రమిస్తారు. ఎటువంటి అడ్డంకినైనా సరే తమ మెదడుకు పదును పెట్టి అధిగమిస్తారు. కాగా.. టోక్యో ఒలింపిక్స్‌లో ఇటీవల బంగారు పతకం గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రీడాకారిణి జెసికా ఫాక్స్ తన అనుభవాల గురించి టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. కనూయింగ్ పోటీల్లో పతకం గెలుచుకున్న ఆమె..కొన్ని సందర్భాల్లో తన బోటును(ఇంగ్లిష్‌లో కయాక్ అని పిలుస్తారు) ఎలా రిపేర్ చేసిందీ కెమెరాతో రికార్డు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు ఈ వీడియోను చూసి అవాక్కవుతున్నారు. కయాక్ ముందు భాగం కొద్దిగా దెబ్బదినడంతో ఆమె కోచ్‌.. ఓ రకమైన పిండి పదార్థాన్ని కయాక్ ముందుభాగానికి అంటించారు. ఇది జారి పోకుండా ఉండేందుకు కయాక్‌కు ఓ కండోమ్‌ను తొడిగి రిపేరింగ్‌ను పూర్తి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-07-30T03:19:50+05:30 IST