అరకొరగా మధ్యాహ్న భోజనం

ABN , First Publish Date - 2022-06-26T05:54:19+05:30 IST

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట మోడల్‌స్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని అరకొరగా అందిస్తున్నారు. పాఠశాలలో 350 మంది విద్యార్థులు ఉండగా ప్రతీరోజు 100 మంది వరకు టిఫిన్‌ బాక్కులు తెచ్చుకుంటున్నారు. అయితే పాఠశాలలోనే విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేలా ప్రొత్సహించాల్సిన ఉపాధ్యాయులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు.

అరకొరగా మధ్యాహ్న భోజనం


ప్రతీరోజు అందరికీ అందిస్తున్నట్లు రికార్డుల్లో నమోదు

ఇంటి నుంచే టిఫిన్‌ బాక్సులు తెచ్చుకుంటున్న విద్యార్థులు

విషయం తెలిసి దుబ్బాక మోడల్‌స్కూల్‌ను తనిఖీ చేసిన ఎంఈవో

బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి


దుబ్బాక, జూన్‌ 25 : దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట మోడల్‌స్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని అరకొరగా అందిస్తున్నారు. పాఠశాలలో 350 మంది విద్యార్థులు ఉండగా ప్రతీరోజు 100 మంది వరకు టిఫిన్‌ బాక్కులు తెచ్చుకుంటున్నారు. అయితే పాఠశాలలోనే విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేలా ప్రొత్సహించాల్సిన ఉపాధ్యాయులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే ప్రిన్సిపాల్‌తో పాటు కొంత మంది ఉపాధ్యాయులు మాత్రం ప్రతీరోజు 350 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి ప్రభుదాస్‌ శనివారం మోడల్‌ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులను సమస్యలను అడిగితెలుసుకున్నారు. భోజనం సరిపోక కొంత మంది విద్యార్థులు పస్తులుంటున్న విషయం తెలిసిందని, దీనికి కారణమైన వారిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎంఈవో ఈసందర్భంగా తెలిపారు. అలాగే శుక్రవారం మధ్యాహ్న భోజనంలో వడ్డించిన గుడ్డు(ఎగ్‌)తో 20 మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు ఆలస్యంగా తెలిసింది. దానికి భాద్యులైన వారిపై కూడా చర్యలను తీసుకుంటామని ఎంఈవో స్పష్టం చేశారు. పాఠశాలలో చాలీచాలని భోజనం అందించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రిన్సిపాల్‌ సుప్రియను ఫోన్‌ ద్వారా సంప్రదించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా ఆమె స్పందించలేదు.  


Updated Date - 2022-06-26T05:54:19+05:30 IST