Gujarat: లంపి చర్మవ్యాధితో 1000కి పైగా పశువుల మృత్యువాత...రైతుల కలవరం

ABN , First Publish Date - 2022-07-27T13:06:47+05:30 IST

గుజరాత్ రాష్ట్రంలో లంపి చర్మ వ్యాధుల కలకలం నెలకొంది....

Gujarat: లంపి చర్మవ్యాధితో 1000కి పైగా పశువుల మృత్యువాత...రైతుల కలవరం

అహ్మదాబాద్ (గుజరాత్):గుజరాత్(Gujarat) రాష్ట్రంలో లంపి చర్మ వ్యాధుల(Lumpy skin disease) కలకలం నెలకొంది. లంపి అంటువ్యాధి కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని 15 జిల్లాల్లో వెయ్యికి పైగా పశువులు మరణించాయి(kills).ఆవులు, గేదెలు(cows and buffaloes) చర్మవ్యాధితో మృతి చెందుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని 15 జిల్లాల్లోని జంతువుల్లో లంపి చర్మవ్యాధి వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నత స్థాయి అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణాంతక వైరస్‌ నుంచి పశువులను ఎలా రక్షించాలనే దానిపై చర్చించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ల‌క్ష‌ల‌కు పైగా జంతువుల‌కు లంపి వైరస్ రాకుండా వ్యాక్సిన్‌ వేశారు.లంపి చర్మ వ్యాధులపై పశువైద్యాధికారులు సర్వే చేసి, విశ్లేషణ కూడా ప్రారంభించారు. 


192 వెటర్నరీ ఆఫీసర్లు పశువులకు టీకాలు వేసే కార్యక్రమం చేపట్టారు.పశువులకు లంపి చర్మ వ్యాధిని నివారించేందుకు వీలుగా గుజరాత్ ప్రభుత్వం 24 గంటల టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో పశువుల యజమానులు 1962 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చు.ఏ గ్రామంలోనైనా పశువులకు చర్మవ్యాధి కేసు గుర్తిస్తే 5 కిలోమీటర్ల పరిధిలో అన్ని పశువులకు టీకాలు(vaccinated) వేస్తున్నారు. లంపీ స్కిన్ డిసీజ్ ఆవులు, గేదెల వంటి పశువుల్లో వ్యాపిస్తుంది. లంపి వైరస్‌ సోకిన పశువుల కోసం ప్రత్యేకంగా షెల్టర్‌ హోంను కూడా ప్రారంభించనున్నారు.గుజరాత్‌లోని దిసిస్‌, జామ్‌నగర్‌, కచ్‌, రాజ్‌కోట్‌, సురేంద్రనగర్‌, మోర్బి, దేవ్‌భూమి ద్వారకా, పోర్‌బందర్‌, భావ్‌నగర్‌, అమ్రేలి, జునాగఢ్‌, బొటాడ్‌, గిర్‌ సోమనాథ్‌, బనస్‌కాంత, పటాన్‌స్కంత, పటాన్‌స్కంతలోని 1,126 గ్రామాల్లోని ఆవులు, గేదెల్లో ఈ చర్మ వ్యాధి ప్రబలింది. ఈ చర్మవ్యాధి ప్రభావం 41,242 పశువుల్లో కనిపించిందని పశువైద్యాధికారులు చెప్పారు.


Updated Date - 2022-07-27T13:06:47+05:30 IST