బీరకాయ సూప్‌

ABN , First Publish Date - 2021-12-04T18:46:52+05:30 IST

బీరకాయ - అరకేజీ, ఉల్లిపాయలు - మూడు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, నల్లమిరియాలు - నాలుగైదు, పుదీనా - ఒకకట్ట, ఉప్పు - తగినంత.

బీరకాయ సూప్‌

చలి తీవ్రత పెరుగుతోంది. ఈ సమయంలో వేడి వేడి సూప్‌లు తాగితే ఒంట్లో వేడితో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. బీర, బెండ, ఉల్లిపాయ, గుమ్మడికాయలతో చేసే ఈ సూప్‌ల రుచులను మీరూ ఆస్వాదించండి.


కావలసినవి: బీరకాయ - అరకేజీ, ఉల్లిపాయలు - మూడు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, నల్లమిరియాలు - నాలుగైదు, పుదీనా - ఒకకట్ట, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: బీరకాయను శుభ్రంగా కడిగి కట్‌ చేసుకోవాలి. రెండు ఉల్లిపాయలను తరగాలి. వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలను, మిరియాలను కుక్కర్‌లో తీసుకోవాలి. రెండు కప్పుల నీళ్లు పోసి ఒక విజిల్‌ వచ్చే వరకు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత చిన్నమంటపై పావుగంటపాటు ఉడకనివ్వాలి. ఆవిరిపూర్తిగా పోయిన తరువాత తీసి మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. తరువాత వడగట్టుకోవాలి. ఈ సూప్‌ను మరో పాన్‌లోకి తీసుకుని స్టవ్‌పై పెట్టి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. సూప్‌ చిక్కదనాన్ని బట్టి నీళ్లు కలుపుకోవాలి. పుదీనా ఆకులు, తరిగిన ఉల్లిపాయలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-12-04T18:46:52+05:30 IST