లూథియానా కోర్టు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారి అరెస్టు

ABN , First Publish Date - 2021-12-29T20:31:57+05:30 IST

పంజాబ్‌లోని లూథియానా కోర్టు పేలుళ్ల కేసులో ముందడుగుపడింది.

లూథియానా కోర్టు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారి అరెస్టు

పంజాబ్‌లోని లూథియానా కోర్టు పేలుళ్ల కేసులో ముందడుగుపడింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న జర్మనీకి చెందిన ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీని అరెస్టు చేశారు. సెట్రల్ జర్మనీలోని ఎర్పార్ నుంచి ఫెడరల్ పోలీసులు ముల్తానీని అదుపులోకి తీసుకున్నారు. లూథియానా బాంబు పేలుళ్ల ప్రాథమిక విచారణలో ముల్తానీ పేరు బయటపడింది. 


పాక్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్ స్టార్ హర్విందర్ సింగ్ ద్వారా లూథియానా బాంబ్ పేలుళ్లకు ప్లాన్ చేశాడు. ముల్తానీని విచారించేందుకు భారత్ దర్యాప్తు సంస్థలు త్వరలో జర్మనీకి వెళ్లే అవకాశముంది. పంజాబ్ పోలీసుల నుంచి డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్ గగన్ దీప్ సింగ్‌ను లూథియానా పేలుళ్లకు ఉపయోగించుకున్నట్లు సమాచారం.


అంతేకాదు.. దేశంలోని ఢిల్లీ, ముంబాయిలోనూ ముల్తానీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ముల్తానీని జర్మన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖలిస్తాన్ అనుకూలుడే కాకుండా ముల్తానీ పంజాబ్ సరిహద్దు నుంచి పాకిస్తాన్ ద్వారా భారత దేశానికి ఆయుధాలు, మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్‌లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లూథియానా కోర్టులో పేలుడు ఘటన సంచలనం రేపింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. ముల్తానీ పంజాబ్‌‌కు చెందిన వ్యక్తి.

Updated Date - 2021-12-29T20:31:57+05:30 IST