లక్కీ లేడీస్‌!

ABN , First Publish Date - 2021-03-01T05:45:16+05:30 IST

ఆ ఇద్దరూ అదృష్టం వరించిన మహిళామణులు. వంద రూపాయల లాటరీ టిక్కెట్టుతో కోటి రూపాయలు గెలుచుకున్న మహిళ ఒకరైతే, ఏకంగా మెర్సిడెజ్‌ బెంజ్‌ కారును సొంతం చేసుకున్న లక్కీ లేడీమరొకరు. ఆ ఇద్దరి కథ ఇది!

లక్కీ లేడీస్‌!

ఆ ఇద్దరూ అదృష్టం వరించిన మహిళామణులు. వంద రూపాయల లాటరీ టిక్కెట్టుతో కోటి రూపాయలు గెలుచుకున్న మహిళ ఒకరైతే, ఏకంగా మెర్సిడెజ్‌ బెంజ్‌ కారును సొంతం చేసుకున్న లక్కీ లేడీమరొకరు. ఆ ఇద్దరి కథ ఇది!


వందతో కోటి!

పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రేణు చౌహాన్‌ మధ్యతరగతి గృహిణి. ఆమె భర్త దుస్తుల వ్యాపారి. ఫిబ్రవరి 11న పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం లాటరీ టిక్కెట్‌ ఫలితాన్ని ప్రకటించినప్పుడు రేణుక ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. విజేతగా ప్రకటించిన లాటరీ నంబరుతో తన దగ్గరున్న లాటరీ టిక్కెట్‌ను పదే పదే సరిపోల్చుకున్నారు. ఆ నంబరు ‘డి - 12228’. ఏ ఒక్క అంకెలోనూ తేడా లేదు. ఆమె లాటరీ గెలిచారు. అదీ... ఏకంగా కోటి రూపాయల లాటరీ! లాటరీ టిక్కెట్లు కొనే అలవాటున్న రేణు వీలున్నప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని లాటరీ టిక్కెట్లను కొనేవారు. అలా వంద రూపాయలతో ఓ టిక్కెట్టు కొనుగోలు చేశారు తర్వాత ఆ విషయమే మర్చిపోయింది. లాటరీ ఫలితాలు  విడుదలైనప్పుడు తన దగ్గరున్న టిక్కెట్‌తో నంబరు సరిపోల్చుకుని తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘‘మా  కుటుంబం ఆనందంగా జీవించడానికి ఆ బంపర్‌ ప్రైజ్‌ మనీ ఉపయోగపడుతుంద’’ని ఆనందం వ్యక్తం చేశారు. స్టేట్‌ లాటరీ డిపార్ట్‌మెంట్‌కు లాటరీ టిక్కెట్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన రేణు, త్వరలో తన బ్యాంక్‌ అకౌంట్‌లో జమ కాబోయే కోటి రూపాయల ప్రైజ్‌ మనీ కోసం ఎదురుచూస్తున్నారు. 




జాక్‌పాట్‌లో 70 లక్షల కారు!

ముంబయికి చెందిన సంగీతా ఖన్నా సెలబ్రిటీ మేకప్‌ ఆర్టిస్ట్‌. క్రెడిట్‌ కార్డు బిల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ‘క్రెడ్‌’లో ఆమెకు సభ్యత్వం ఉంది. గత ఏడాది నవంబరు 9న, రఫెల్‌ లక్కీ విన్నర్‌ పేరు ప్రకటించినప్పుడు సంగీత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. రఫెల్‌ జాక్‌పాట్‌లో సంగీత ఏకంగా ‘మెర్సిడెజ్‌ బెంజ్‌ జిఎల్‌సి కూపె’ కారును గెలుచుకున్నారు. ఈ కారు ధర అక్షరాలా 70 లక్షలు. ఖరీదైన కారును జాక్‌పాట్‌లో ఉచితంగా గెలుచుకున్న సంగీత తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోతున్నారు.   క్రెడ్‌ (సిఆర్‌ఇడి) అనే యాప్‌ అన్ని రకాల క్రెడిట్‌ కార్డుల బిల్స్‌ చెల్లింపులకూ తోడ్పడే ప్లాట్‌ఫామ్‌. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలపరంగా అత్యంత గోప్యత పాటించే క్రెడ్‌ విశ్వసించదగిన, సురక్షితమైన యాప్‌గా పేరు పొందింది. ఈ యాప్‌ ద్వారా క్రెడిట్‌ కార్డుల బిల్లులు చెల్లించి, క్రెడ్‌ కంపెనీ నుంచి కాయిన్స్‌, రివార్డ్సు పొందవచ్చు. సభ్యులు క్రెడిట్‌ రివార్డుల రూపంలో పొందిన కాయిన్లు, జెమ్స్‌తో వేర్వేరు ప్రముఖ బ్రాండ్లను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. క్రెడ్‌ ఐపిల్‌ 2020 అధికారిక భాగస్వామి కూడా! పలు ప్రఖ్యాత బ్రాండ్లతో అనుసంధానమై ఉన్న క్రెడ్‌ తాజాగా మెర్సిడెజ్‌ కంపెనీతో కూడా జత కట్టింది. అలాగే క్రెడ్‌ కంపెనీ రఫెల్‌ గేమ్స్‌తో కూడా అనుసంధానమై ఉంది. క్రెడ్‌ యాప్‌ ద్వారా సమయంలోగా చెల్లించిన క్రెడిట్‌ కార్డుల బిల్స్‌ సహాయంతో రఫెల్‌లో కూడా టిక్కెట్లు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అలా క్లెయిమ్‌ చేసుకునే సభ్యులతో రఫెల్‌ లాటరీ పద్ధతిలో జాక్‌పాట్‌ విన్నర్‌ను ఎంపిక చేస్తూ ఉంటుంది. అలా గతేడాది లక్కీ విన్నర్‌గా సంగీతా ఖన్నా పేరును ప్రకటించింది. జాక్‌పాట్‌లో భాగంగా సంగీతా మెర్సిడెజ్‌ బెంజ్‌ జిఎల్‌సి కూపె కారును గెలుచుకున్నారు.


Updated Date - 2021-03-01T05:45:16+05:30 IST