ఢిల్లీ కేపిటల్స్‌పై టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్

ABN , First Publish Date - 2022-04-08T00:40:01+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ కేపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఢిల్లీ కేపిటల్స్‌పై టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ కేపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోమాటకు తావులేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన లక్నో రెండింటిలో విజయం సాధించగా, ఢిల్లీ కేపిటల్స్ రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో గెలిచింది.


లక్నో జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మనీష్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్ జట్టులోకి వచ్చాడు. ఢిల్లీ జట్టులో మాత్రం మూడు మార్పులు జరిగాయి.  సీఫెర్ట్ స్థానంలో డేవిడ్ వార్నర్, ఖలీల్ స్థానంలో అన్రిక్ నార్జ్, మన్‌దీప్ స్థానంలో సర్ఫరాజ్ జట్టులోకి వచ్చారు. 

Updated Date - 2022-04-08T00:40:01+05:30 IST