Abn logo
Sep 29 2020 @ 01:35AM

రియల్‌ ఢమాల్‌ !

Kaakateeya

ఎల్‌ఆర్‌ఎస్‌తో భూదందాకు చెక్‌

ఉమ్మడి జిల్లాలో నిలిచిన లేఅవుట్‌ లేని ప్లాట్ల విక్రయాలు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై తీవ్ర ప్రభాభం

ఉభయ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూముల్లో అక్రమ వెంచర్లు

ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండానే ప్లాట్ల విక్రయాలు

ఆందోళనలో కొనుగోలు దారులు


కామారెడ్డి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ దందా ఒక్కసారిగా పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంతో విచ్చలవిడిగా సాగుతున్న భూదందాకు చెక్‌ పెట్టినట్టయింది. లే అవుట్‌లేని ప్లాట్ల రిజి స్ట్రేషనులు నిలిచిపోవడంతో నిబంధనలు పాటించకుండా వ్యవసాయ భూములను సైతం ప్లాట్లుగా మార్చి విక్రయిం చిన వారి ఆటలకు బ్రేక్‌ వేసినట్టయింది. నిజామాబాద్‌, కా మారెడ్డి జిల్లాల్లో కరోనా నేపథ్యంలో మార్చి నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలైంది. లాక్‌డౌన్‌ పూర్తయిన అనంత రం కొద్దిగా ఊపందుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయం, కొత్త మున్సిపల్‌, పంచాయతీ, రెవెన్యూ చట్టాలను అమలులోకి తీసుకురావడం తో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయడం తో రియల్‌ ఎస్టేట్‌ రంగం మళ్లీ ఒక్క సారిగా కుప్పకూలింది. 


నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల విక్రయం

నిజామాబాద్‌, కామారె డ్డి జిల్లాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాసిగి న సమయంలో వ్యవసా య భూములను వ్యవసా యేతర భూములుగా మార్చ కుండా.. నిబంధనలకు విరుద్ధం గా ప్లాట్లుగా మార్చి విక్రయించా రు. ఇలా వేలాది ప్లాట్లను విక్రయించి దందా కొనసాగిస్తూ వచ్చారు. పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కోట్లకు పడగలెత్తారు. కొత్త రెవెన్యూ, మున్సిప ల్‌, పంచాయతీ రాజ్‌ చట్టాలు అమలులోకి రావడంతో రియ ల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గుతూ వచ్చింది. గుంట భూమి కొ నాలన్నా, అమ్మలన్నా ఎల్‌ఆర్‌ఎస్‌ ఉందో లేదో తెలుసుకోవా ల్సిన అవసరం ఏర్పడింది. గతంలో లే అవుట్‌లు లేకుండా కొనుగోలు చేసిన ప్లాట్లకు ఎల్‌ఆర్‌ ఎస్‌ చేయించుకోవాల్సిందే. దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


లే అవుట్‌లేని వెంచర్లలో స్పందన కరువు

కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా వెంచర్‌లు చేసి అమ్మకాలు జరిపి నవారిలో స్పందన కనిపించడం లేదు. ఇప్పటివరకు కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో 82 అక్రమ లేవుట్‌ గల వెంచర్లు, 3,991 ప్లాట్లను ము న్సిపల్‌ అధికారులు గుర్తించా రు. ఇందులో 3,21 1 ప్లాట్ల వారు మాత్రమే ఎల్‌ఆర్‌ ఎస్‌కు దరఖాస్తు చేసుకు న్నారు. ఎక్కడపడితే అక్క డ ఇష్టరీతిన వెంచర్లు చేసి అమ్మకాలు జరిపిన వారు మాత్రం ఇప్పటివరకు ఒక్క రు కూడా దరఖాస్తు చేసుకోక పోవడం గమనార్హం. ఇందులో చాలా వరకు వ్యవసాయభూములు ఉండడం, నిబంధనలకు తగినట్టుగా వెంచర్లు లేకపోవడం తో ఏ విధంగా దరఖాస్తు చేయాలో తెలియక రియల్‌ ఎస్టే ట్‌ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోం ది. ముఖ్యంగా మున్సిపల్‌ పరిధిలోని వీలినగ్రామాల్లో ఈ తరహా వెంచర్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇష్టారీతిన వెంచర్లు చేసి అమ్మకాలు జరి పిన.. జరపాలనుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.


ఖాళీ స్థలాలు లేకుంటే అదనపు రుసుము

నిబంధనలకు విరుద్ధంగా చేసిన వెంచర్లలో.. లే అవుట్‌ లేని ప్లాట్లలో 10 శాతం ఖాళీ స్థలం చూపించాలని మున్సిప ల్‌ చట్టం చెబుతోంది. ఈ ఖాళీ స్థలాలను దేవాలయం, పా ర్కు, పాఠశాల భవన నిర్మాణాలకు వినియోగించనున్నారు. ఎలాంటి సదుపాయాలు లేకుండా ఏర్పాటుచేసిన ప్లాట్లకు అదనంగా 14 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.


సామాన్యుల పరిస్థితి దారుణం

ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం రానుండగా.. సామాన్యుల పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. రూపాయి.. రూపాయి కూడా బెట్టుకుని ప్లాటు కొన్నవారు ఎల్‌ఆర్‌ఎస్‌కు అప్పు చే యాల్సిన దుస్థితి ఏర్పడింది. జీవితకాలం కష్టపడి ఓ చిన్న ఇల్లు కట్టు కుందామని ప్లాటు కొన్నవారికి ఎల్‌ఆర్‌ఎస్‌ గుదిబండగా తయారైంద ని.. ప్రభుత్వం పునరా లోచించాలని సామాన్యులు కోరుతున్నారు.


 ఉమ్మడి జిల్లాలో 30,089 అక్రమ ప్లాట్లు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సుమారు 30,089 అక్ర మప్లాట్లు ఉన్నట్టు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటి పరిధిలో 19,088 అనుమతి లేని ప్లాట్లు ఉన్నాయి. ని జామాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలో 140, నుడా పరిధి లో 45, ఆర్మూర్‌, బోధన్‌ , భీమ్‌గల్‌ మున్సిపాలిటీల పరిధిలో 608 అక్రమ ప్లాట్లు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 9,257 అక్రమ ప్లా ట్లు, కామారెడ్డి మున్సిపాలిటీలో లేఅవుట్‌ లేని వెంచర్‌లు 82, ప్లాట్లు 3,991 ఉన్నట్టు మున్సిపల్‌ అధికారులు గుర్తించా రు. బాన్సువాడ మున్సిపాలిటీ లో 300, ఎల్లారెడ్డి మున్సిపాలి టీ పరిధిలో 60కిపైగా అక్రమ ప్లాట్లు ఉన్నట్లు ఆయా శాఖల అధికారులు గుర్తించారు.


క్రమబద్ధీకరణకు మరో అవకాశం

లే అవుట్‌ లేకుండా ఏర్పాటు చేసిన స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అక్టోబరు 15వ తేదీలో పు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం రూ.1000 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వెంచర్‌లకైతే దరఖాస్తు సమయంలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 2020 ఆగస్టు 26వ తేదీలోపు డాక్యుమెంట్‌ కలిగి ఉన్న ప్లాట్‌లను క్రమబద్ధీకరించనున్నారు.


ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుంటే ఎలాంటి అనుమతులు ఉండవు..దేవేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో మొత్తం 3,991 ప్లాట్లు, 82 అక్రమ లేవుట్‌గల వెంచర్లను గుర్తించాం. ఇప్ప టివరకు 3,211 ప్లాట్ల వారు మాత్రమే ఎల్‌ ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ 15 రోజులలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకా శం ఉంది. అక్టోబరు 15వ తేదీలోపు ఎల్‌ఆర్‌ఎస్‌ కు దరఖాస్తు చేసుకోని వారి పట్ల కఠినంగా వ్య వహరిస్తాం. మున్సిపల్‌ నుంచి అందాల్సిన ఏ సౌకర్యాలను, అనుమతులను ఇవ్వబోం. 2020 ఆగస్టు 26వ తేదీలోపు డాక్యుమెంట్‌ కలిగి ఉన్న వారు ప్లాట్ల ను క్రమబద్ధీకరించుకోవాలి.

Advertisement
Advertisement