నేటి నుంచి commercial gas cylinders ధర రూ.266 పెంపు

ABN , First Publish Date - 2021-11-01T14:46:10+05:30 IST

పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ పై కూడా బాదుడు మొదలుపెట్టింది...

నేటి నుంచి commercial gas cylinders ధర రూ.266 పెంపు

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ పై కూడా బాదుడు మొదలుపెట్టింది.గ్యాస్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర సోమవారం నుంచి 266 రూపాయలు పెంచాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1734 నుంచి 2,000.50 పైసలకు పెంచింది.ఢిల్లీలో నవంబరు 1వతేదీ నుంచి కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,000.50కు పెంచినట్లు గ్యాస్ కంపెనీలు తాజాగా ప్రకటించాయి.అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచలేదు.దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర నెలవారీ ప్రాతిపదికన పెరుగుతోంది.సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీ మొత్తం నేరుగా వ్యక్తుల బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది. సబ్సిడీ మొత్తం ప్రతి నెల మారుతూ ఉంటుంది.


Updated Date - 2021-11-01T14:46:10+05:30 IST