న్యూఢిల్లీ: దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర బుధవారం నుంచి పెరిగింది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ధర సిలిండరుపై రూ.50 పెరిగింది.దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేటి నుంచి గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.1,003 నుంచి రూ.1,053కి పెరిగింది.డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 14.2 కిలోల ధర 50రూపాయలు పెరిగింది. హైదరాబాద్ నగరంలో రూ.1055 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర బుధవారం నుంచి రూ.1105కు పెరిగింది. ఈ నెల 1వతేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించినా, బుధవారం నుంచి గృహ అవసరాల గ్యాస్ ధరను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
మార్చి 22న కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. అంతకుముందు 2021 అక్టోబర్, 2022 ఫిబ్రవరి నెలల మధ్య దేశీయ ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ.899.50గా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడనుంది.
ఇవి కూడా చదవండి