న్యూఢిల్లీ: దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు మంగళవారం నుంచి పెరిగాయి. ఢిల్లీ, ముంబై, ఇతర నగరాల్లో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు 50 రూపాయలకుపైగా పెరిగాయి.పెట్రోల్, డీజిల్ తర్వాత దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది.ఇప్పుడు ఢిల్లీ, ముంబైలలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.949.50కు పెరిగింది. కోల్‌కతాలో వినియోగదారుడు సిలిండరుకు రూ.976 చెల్లించాల్సి ఉంటుంది.చెన్నైలో రూ.965.50లు, లక్నోలో రూ.987.50కి పెంచారు.పాట్నాలో కూడా ధరలు పెంచారు. పాట్నాలో ఎల్‌పిజి సిలిండర్ ఇప్పుడు రూ. 1,039.50కి విక్రయిస్తున్నారు.
137 రోజుల తర్వాత దేశంలో మంగళవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి.ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.21, డీజిల్ లీటరు ధర రూ. 87.47 రూపాయలకు విక్రయిస్తున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు 40శాతం పెరగడంతో డీజిల్ ధరలు కూడా పెంచారు.
ఇవి కూడా చదవండి