LPG cylinder: లక్నోలో సిలిండర్ పేలి ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

ABN , First Publish Date - 2022-10-04T13:18:37+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోని ఓ ఇంట్లో సోమవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండరు పేలిన ఘటనలో( LPG cylinder blast) ఒకరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు...

LPG cylinder: లక్నోలో సిలిండర్ పేలి ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

 లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోని ఓ ఇంట్లో సోమవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండరు పేలిన ఘటనలో( LPG cylinder blast) ఒకరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.లక్నో నగరంలోని బర్గాడి గ్రామం(UPs Lucknow) బక్షితలాబ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో జుబేర్ అనే 30 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ పేలుడులో సల్మాన్, సైఫ్, అస్లాం, సమర్ షబ్నం, జాకిరాలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జిల్లా అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-10-04T13:18:37+05:30 IST