విశ్వాసమైన నేస్తం!
ABN , First Publish Date - 2022-06-26T05:30:00+05:30 IST
విశ్వాసమైన జంతువు ఏది? అంటే కుక్క అని ఠక్కున సమాధానం చెబుతారు. నిజమే! యజమానికి అత్యంత విశ్వాసంగా ఉండే జంతువు కుక్క.
విశ్వాసమైన జంతువు ఏది? అంటే కుక్క అని ఠక్కున సమాధానం చెబుతారు. నిజమే! యజమానికి అత్యంత విశ్వాసంగా ఉండే జంతువు కుక్క. ప్రపంచవ్యాప్తంగా రెండు వందలకు పైగా జాతుల కుక్కలు ఉన్నాయి. కొన్ని రకాల జాతులకు చెందిన కుక్కల ధర లక్షల్లో ఉంటుంది.
కుక్క శరీరంలో వాసనను గ్రహించే 22 కోట్ల కణాలు ఉన్నాయి. మనిషి కన్నా 40 రెట్లు ఎక్కువ ఘ్రాణశక్తి కుక్కలకు ఉంటుంది.
మేకలు, గొర్రెలు, పశువులకు కాపరిగా పనిచేస్తుంది. దృష్టిలోపంతో బాధపడేవారికి సహాయకారిగా ఉంటుంది.
మనుషులకు వేలిముద్రలు భిన్నంగా ఉన్నట్టుగా, ప్రతీ కుక్క నోస్ ప్రింట్ భిన్నంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల తరువాత చూసినా అవి వాటి యజమానిని ఇట్టే గుర్తుపడతాయి.
పోలీసు జాగిలాలు బాంబులను గుర్తించడంలో, నేరస్తులను పట్టించడంలోనూ సహాయపడుతుంటాయి.
ఎండుద్రాక్ష, గ్రేప్స్, ఉల్లిపాయ, వెల్లుల్లి.... వీటిని తింటే కుక్క అనారోగ్యానికి గురవుతుంది.