Abn logo
Sep 29 2020 @ 00:29AM

నిండుకుండలా దిగువ మానేరు

Kaakateeya

ఎల్‌ఎండీ సామర్థ్యం 24.034 టీఎంసీలు

పూర్తిగా నిండిన జలాశయం


తిమ్మాపూర్‌, సెప్టెంబరు 28: కరీంనగర్‌ పరిధిలోని దిగువ మానేరు జలాశయం  నిండు కుండలా మా రింది. ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ నిర్మాణం 1986లో పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి సామ ర్ధ్యం మేరకు నీటిని నిల్వ చేయలేదు. ఇప్పటి వరకు ఎల్‌ఎండీలోకి 23.500 టీఎంసీల వరకు నిల్వ ఉం చుతూ మిగితా నీటిని గేట్ల ద్వారా దిగువకు విడు దల చేస్తున్నారు. సోమవారం ఎల్‌ఎండీ పూర్తి సామ ర్ధ్యం 24.034 టీఎంసీలు కాగా అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంచారు.  సోమవారం సాయంత్రం 5.30 ప్రాం తంలో ఎల్‌ఎండీ పూర్తి సామర్ధ్యం మేరకు చేరుకుంది. ఇంకా పై నుంచి ఎల్‌ఎండిలోకి వరద కొనసాగుతూనే ఉంది. 


కొనసాగుతున్న నీటి విడుదల

వీణవంక మండలం చల్లూర్‌లో ఆదివారం చేపల వేటకు వెళ్ళిన ముగ్గురు మత్స్యకారులు మానేరు వాగులో చిక్కుకున్న సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎనిమిది గేట్లను ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మూసివేశారు. రాత్రి 10.30 ప్రాంతంలో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారనే  సమాచారంతో తిరిగి  ఆర్ధరాత్రి నాలుగు గేట్లు తెరిచి మానేరు వాగులోకి నీటిని విడుదల చేశారు. ఎల్‌ఎండిలోకి వస్తున్న ఇన్‌ఫ్లో అధారంగా సోమవారం  సాయంత్రం 12 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్‌ఎండీ పూర్తి స్ధాయి నీటి మట్టం 24.034 టీఎంసీలు కాగా రాత్రి 11 గంటల సమయంలో 23.516 టీఎంసీలు నిల్వ ఉంది.


మోయ తుమ్మోద వాగు నుంచి 19,552 క్యూసెక్కులు, ఎస్‌ఆర్‌ఆర్‌ రిజర్వాయర్‌ నుంచి 4,822 క్యూసెక్కుల నీటితో పాటు మొత్తం 25,574 క్యూసెక్కుల నీరు ఎల్‌ఎండీలోకి వచ్చి చేరుతుండగా 12 గేట్ల ద్వారా 58.780 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 2,500 క్యూసెక్కు నీటితో పాటు మిషన్‌  భగీరథతో కలిపి మొత్తం 61.589 క్యూసెక్కుల నీటి ఆవుట్‌ ఫ్లో వెళుతుందని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.  


పార్వతీ బ్యారేజీలో 60 గేట్లు ఓపెన్‌

మంథని రూరల్‌ : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీలో 60 గేట్లను సోమవారం ఓపెన్‌ చేసి 2,77,628 క్యూసెక్‌ల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. బ్యారేజీ సామర్ధ్యం 8.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.757 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement