13న బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , First Publish Date - 2022-08-11T08:36:56+05:30 IST

13న బంగాళాఖాతంలో అల్పపీడనం

13న బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో బుధవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఇది బలపడి ఈ నెల 13కల్లా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తరువాత 24 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించనుంది. కాగా, కోస్తాలో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నందున వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 13, 14 తేదీల్లో కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురవనున్నాయని పేర్కొంది. 


Updated Date - 2022-08-11T08:36:56+05:30 IST