Oct 19 2021 @ 12:19PM

మలయాళ ‘ప్రేమతీరం’ గా తెలుగు ‘లవ్‌స్టోరీ’

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన అందమైన ప్రేమకథ ‘లవ్‌స్టోరీ’. గత నెల్లో థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా.. ఓవర్సీస్ లో సైతం సత్తా చాటుకుంది. చైతూ స్ర్కీన్ ప్రెజెన్స్, సాయిపల్లవి నటన, డ్యాన్స్, ఎమోషనల్ ట్రీట్ మెంట్ ఈ సినిమాకి బలంగా నిలిచాయి. అలాంటి అద్భుతమైన ఈ సినిమా మలయాళంలోకి అనువాదమవుతోంది. ‘ప్రేమతీరం’ పేరుతో అక్కడ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలియచేశారు మేకర్స్. 



కులాంతర ప్రేమకథా నేపథ్యం కలిగిన చిత్రాలు మలయాళంలో తరచుగా వస్తుంటాయి. అందుకే ‘లవ్‌స్టోరీ’ మూవీ అక్కడ కూడా బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే.. సాయిపల్లవి ఆల్రెడీ అక్కడ ‘ప్రేమమ్’ మూవీతో తన డెబ్యూ ఇచ్చింది. అదే ‘ప్రేమమ్’ తెలుగు వెర్షన్ లో నాగచైతన్య నటించారు. దాంతో చైతూ కూడా మలయాళీలకు బాగానే సుపరిచితుడు. దాంతో మన ‘లవ్‌స్టోరీ’ మాలీవుడ్ లోకూడా మ్యాజిక్ చేస్తుందని మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్. E4E  మూవీస్ ఈ సినిమాను విడుదల చేస్తోంది. 


Cinema Newsమరిన్ని...