Viral News: పెళ్లి జరుగుతుండగా వేదికపైకొచ్చిన ప్రియుడు.. వరుడిని పక్కకుతోసి మరీ రచ్చ.. అందరూ చూస్తుండగానే వధువుకు..

ABN , First Publish Date - 2022-07-09T19:25:24+05:30 IST

పురోహితుడు మంత్రోచ్ఛరణ చేస్తుండగా.. బంధువు, మిత్రులు, అతిథుల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక మొదలైంది. ఈ క్రమంలో ప్రేయసి వివాహాన్ని చూసేందుకు అక్కడకు వచ్చిన ప్రియుడు.. అనూహ్యంగా

Viral News: పెళ్లి జరుగుతుండగా వేదికపైకొచ్చిన ప్రియుడు.. వరుడిని పక్కకుతోసి మరీ రచ్చ.. అందరూ చూస్తుండగానే వధువుకు..

ఇంటర్నెట్ డెస్క్: పురోహితుడు మంత్రోచ్ఛరణ చేస్తుండగా.. బంధువు, మిత్రులు, అతిథుల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక మొదలైంది. ఈ క్రమంలో ప్రేయసి వివాహాన్ని చూసేందుకు అక్కడకు వచ్చిన ప్రియుడు.. అనూహ్యంగా వేదికపైకి దూసుకెళ్లాడు. అనంతరం వరుడిని పక్కకు తోసేశాడు. ఆ తర్వాత అతడు చేసిన పనికి పెళ్లి కొడుకు సహా పెళ్లికి హాజరైనవారందరూ షాకయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బిహార్‌లోని నలంద జిల్లాకు చెందిన ఓ యువతికి కొద్ది రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే మంగళవారం రోజు.. బంధువులు, మిత్రులు, అతిథులు వివాహానికి హాజరయ్యారు. వధువు, వరుడు దండలు మార్చుకుంటుండగా.. ఓ యువకుడు వివాహ మంటపంలోకి దూసుకొచ్చాడు. వరుడిని పక్కకు నెట్టి.. వధువు మెడలో పూలదండ వేశాడు. అనంతరం ఆమె నుదుటున సింధూరం పెట్టాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. యువకుడి చర్యపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడు.. అక్కడ నుంచి వెళ్లిపోవడంతో పెళ్లి ఆగిపోయింది. 



కుమార్తె పెళ్లి ఆగిపోవడంతో.. వధువు తల్లిదండ్రులు ఆ యువకుడిని చితకబాదారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశాడు. అయితే.. ఆ యువకుడు మాత్రం.. తన చర్యను సమర్ధించుకున్నాడు. ఆ యువతి, తాను కొద్ది రోజులుగా ప్రేమించుకున్నట్టు చెప్పాడు. ఈ విషయం ఆమె ఇంట్లో తెలియడంతో.. వివాహం ఫిక్స్ చేసినట్టు తెలిపాడు. అయితే ఆ పెళ్లి యువతికి ఏ మాత్రం ఇష్టం లేదని వెల్లడించాడు. ఈ క్రమంలోనే వివాహం జరుగుతుండగా.. అక్కడకు వచ్చి పూలదండ వేయడంతోపాటు బొట్టుపెట్టాలని యువతి తనకు చెప్పిందన్నాడు. ముందుగా అనుకున్నట్టుగానే.. పెళ్లి జరుగే సమయంలో అక్కడకి వెళ్లి అలా చేశానని వివరించాడు. 


Updated Date - 2022-07-09T19:25:24+05:30 IST