Oct 13 2021 @ 19:37PM

‘లవ్ యు టూ’తో హీరో అవుతోన్న కొరియోగ్రాఫర్

హ్యాష్ ట్యాగ్ పిక్చర్ బ్యానర్‌పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్, ప్రాచి, జ్యోతి నటీనటులుగా యోగి కుమార్ దర్శకత్వంలో.. శ్రీకాంత్ కీర్తి నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ యు టూ’. ఈ చిత్ర ట్రైలర్‌ను అధికారికంగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ వైజాగ్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను హైదరాబాద్  ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ‘నువ్వు తోపురా’ డైరెక్టర్ హరినాథ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో దర్శకుడు హరినాథ్ మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా తీసి మనకు మనమే ప్రూవ్ చేసుకోవాలి అప్పుడే ఇండస్ట్రీలో నిలబడగలుగుతాము. తీసిన ప్రతి సినిమా హిట్టయితే చేసిన ప్రతి ఒక్కరూ స్టార్స్ అయ్యే వారు. సినిమా తీయడం అంటే పెద్ద స్ట్రగుల్‌తో కూడుకున్న పని అలా సక్సెస్ అందుకున్న కొందరే స్టార్స్ అవుతారు. రామాచారిగారి అబ్బాయి సాకేత్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. శ్యాం విజువల్స్ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. ఆట ద్వారా కొరియోగ్రాఫర్‌గా సందీప్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు ఈ చిత్రంతో హీరోగా అడుగు పెడుతున్నాడు. మంచి నటుడిని సెలెక్ట్ చేసుకుని మంచి కంటెంట్‌ను సెలెక్ట్ చేసుకొన్నాడు దర్శకుడు యోగి. ట్రైలర్ చాలా బాగుంది’’ అని తెలుపగా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘వివి వినాయక్‌గారు ఎంతో బిజీగా ఉన్నా మా ట్రైలర్‌ని విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత శ్రీకాంత్ గారు యుఎస్‌లో ఉండి.. మా క్రూ ని చూడకుండా మా పై నమ్మకంతో ఈ సినిమాను ఇంతవరకు తీసుకొచ్చారు. ఆట సందీప్‌గారు నా స్కూల్ మేట్ తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇందులో చాలా ఎనర్జిటిక్‌గా నటించాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి.. అందరూ బిజీ ఆర్టిస్ట్‌గా మారాలని కోరుతున్నాను’’ అని అన్నారు.

ఈ చిత్ర దర్శకుడు యోగి మాట్లాడుతూ.. ‘‘నేను ఈ చిత్రం ద్వారా ఇద్దరికి థాంక్స్ చెప్పాలి. నేను ఈ చిత్రానికి దర్శకుడిగా ఉండాలని నా గత షార్ట్ ఫిలిమ్స్ లను సందీప్ నిర్మాతకు పంపడంతో ఇంత పెద్ద ప్రాజెక్టుకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు నిర్మాత శ్రీకాంత్. ఇలాంటి అవకాశం చాలా మందికి రాదు. అందుకే వీరిద్దరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లవ్ అనేది ఎప్పుడైనా మనిషి ఏ స్టేజ్‌లో ఉన్నా.. ఏ ఏజ్‌లో ఉన్నా.. మ్యారిటల్ స్టేటస్ ఏమైనా ఒకవేళ ఆ ఇద్దరి మధ్యన అది ప్రేమే అని అనుకుంటే అది ప్రేమే.. నో మేటర్ అది పెళ్లి అయినా వేరే మనిషితో లవ్ అని ఉన్నా.. అనుకున్నా ఆ ఫీలింగ్ కలిగినా ఒకటేలా ఉంటుంది. ఇట్ ఈజ్ నో డిఫ్రెన్స్ అనే జస్టిఫికేషన్స్‌తో వచ్చే సినిమా ఇది. ఇందులో ఐదు డిఫరెంట్ క్యారెక్టర్స్  ఉన్నాయి. ఈ సినిమా లాస్ట్‌లో వైఫ్ ఇచ్చిన మెసేజ్ చూడండి. ఈ మూవీ ఎమోషనల్ డ్రామా. ఇందులో చాలా జస్టిఫికేషన్స్ ఉంటాయి. జ్యోతి గారి పాత్రతో అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. సందీప్‌తో ఈ స్టోరీ గురించి కొన్ని సంవత్సరాలుగా డిస్కషన్ చేస్తున్నాను.. తనతోనే చేయాలని పట్టుబట్టాను. ఈ సినిమా విషయంలో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు.

హీరో ఆట సందీప్ మాట్లాడుతూ.. ‘‘వివి వినాయక్‌గారికి ధన్యవాదాలు. శ్రీకాంత్‌గారికి సినిమా అంటే ప్యాషన్. ఆయన పెద్ద నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పని చేశారు. నా భార్య జ్యోతి నేను చేసే సీన్స్‌లలో ఇలా కాదు అలా చేయమని నాకు సపోర్ట్‌గా నిలిచి చెప్పడం జరిగింది. తనని నేను కో యాక్టర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. తను మై లవ్ అని చెప్పగలను నా లైఫ్‌లో వైఫ్ అని చెప్పగలను. అందరూ ఇది నీ సబ్జెక్టు కదా అని చాలా మంది అడుగుతున్నారు. ఇది నా సబ్జెక్ట్ కాదు దర్శకుడు ఇప్పుడు జరుగుతున్న కథలను బేస్ చేసుకొని తీసిన కథ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది..’’ అని తెలిపారు. సంగీత దర్శకుడు సాకేత్ మాట్లాడుతూ.. ‘‘చాలా బోల్డ్ కంటెంట్‌ని సెలెక్ట్ చేసుకొని దర్శకుడు ఈ సినిమా చేయడం జరిగింది. ఒక మంచి కాన్సెప్ట్‌ని సింపుల్‌గా నీట్‌గా తీసుకొచ్చాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని. నాకీ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు..’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరారు.