Advertisement
Advertisement
Abn logo
Advertisement

విడుదలకు ముందే Americaలో రికార్డు సృష్టించిన ‘లవ్ స్టోరీ’.. భారీ మొత్తంలో..

ఎన్నారై డెస్క్: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ స్టోరీ’.. విడుదలకు ముందే అమెరికాలో రికార్డు సృష్టించింది. భారీ మొత్తంలో డబ్బులను రాబట్టింది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన ‘లవ్ స్టోరీ’ మూవీ వాస్తవానికి ఏప్రిల్ 2, 2020లోనే రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. భారత్‌లో కరోనా పరిస్థితలు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు ప్రారంభించింది.


కాగా..నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన మొదటి సినిమా కావడంతో ఈ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా అవటంతో ‘లవ్ స్టోరీ’పై ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సాయి పల్లవి డ్యాన్స్, ఈ మూవీలోని పాటలు కూడా హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే ‘లవ్ స్టోరీ’ మూవీ అగ్రరాజ్యం అమెరికాలో రికార్డు సృష్టించినట్లు సమాచారం. రిలీజ్‌కు ముందే పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ప్రీ సేల్స్ ద్వారా ‘లవ్ స్టోరీ’ మూవీ అమెరికాలో 150,000 డాలర్లను రాబట్టినట్లు సమాచారం. దీని విలువ ఇండియన్ కరెన్నీలో సుమారు రూ.1.10కోట్ల వరకు ఉంటుంది. కేవలం టెక్సాస్ రీజియన్‌లోనే ఈ మూవీ దాదాపు 27,475డాలర్లను కొల్లకొట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోంది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ఓవర్సీస్ సినిమామరిన్ని...

Advertisement