Sep 17 2021 @ 07:54AM

‘లవ్ స్టోరీ’: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్..!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించబోతుండగా, ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ రానున్నట్టు సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ స్టోరీ’ మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. ‘ఫిదా’ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల - సాయి పల్లవిల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావటంతో అందరిలోనూ ఆసక్తి బాగానే నెలకొంది. చూడాలి మరి ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో. శేఖర్ కమ్ముల, నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. పవన్ సి హెచ్ సంగీతం అందించాడు.