Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేమించి వివాహం చేసుకున్న యువతి.. ఇద్దరు పిల్లల తల్లి.. మరో ప్రియుడి మోజులో ఎంత దారుణానికి పాల్పడిందంటే..

ప్రేమించి పెళ్లిచేసుకున్న ఒక మహిళ మరోప్రేమికుడి మోజులో పడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె ప్రియుడి వద్దకు వెళ్లాలంటే భర్త అడ్డుగా ఉండడంతో దారుణానికి పాల్పడింది. తన నగలు అమ్మిన డబ్బుతో ఆమె భర్తను చంపడానికి సుపారీ ఇచ్చింది. ఈ ఘటన బీహార్ రాష్ట్ర్రంలోని గయా నగరంలో జరిగింది.


బీహార్‌లోని గయా నగర పోలీసులకు నవంబర్ 23న ముహమ్మద్ తయ్యబ్‌ అనే వ్యక్తి శవం దొరికింది. మృతుడిని ఎవరో తుపాకులతో కాల్చిచంపారు. పోలీసుల ఈ హత్యకేసులో విచారణ ప్రారంభించారు. ముందుగా నగరంలోని సుపారీ కిల్లర్స్‌ను పట్టుకొని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు ఈ హత్యకు సంబంధించిన కీలకమైన సమాచారం అందించారు. దానిని బట్టి పోలీసులు సులువుగా ఈ హత్య కేసుని ఛేదించారు.

 

పోలీసుల కథనం ప్రకారం.. గయా నగరానికి చెందిన ఆయోషా పర్వీన్ 12 ఏళ్ల క్రితం అదే నగరంలో నివసించే ముహమ్మద్ తయ్యబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆయెషా ఈ మధ్యకాలంలో మరో యువకుడితో ప్రేమలో పడింది. ఒక సాధారణ ఉద్యోగం చేసే తయ్యబ్‌తో ఆమె ఇక తన జీవితం కొనసాగించడం కష్టంగా భావించి ప్రేమికుడితో వెళ్లిపోవాలనుకుంది.  కానీ సమాజ భయంతో అలా చేయకుండా ముందు అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలనుకుంది. అందుకు ఆమె ప్రియుడి సహాయంతో కొందరు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చింది. తన భర్తను హత్య చేసేందుకు ఆయెషా తన నగలు తాకట్టు పెట్టి ఆ కిరాయి హంతకులకు డబ్బు చెల్లించింది. మరుసటి రోజు ఉద్యోగం కోసం బయటకు వెళ్లిన తయ్యబ్‌ను కొందరు దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. 


హత్యానేరంలో అనుమానితులుగా కొందరు కిరాయి హంతకులను పోలీసుల విచారణ చేయగా.. వారు ఈ హత్య మృతుడి భార్య చెప్పడంతోనే చేశామని అంగీకరించారు. దీంతో పోలీసులు ఆయోషా పర్వీన్, ఆమె ప్రియుడిపై హత్యానేరం మోపి అరెస్టు చేశారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement