ప్రేమ పెళ్లి వ్యవహారం.. సర్పంచ్‌ భర్తపై ఎస్సై దాడి.. చివరకు..

ABN , First Publish Date - 2020-07-13T16:37:42+05:30 IST

ఓ సర్పంచ్‌ భర్తపై అకారణంగా దాడి చేసిన ఎస్సైని సీఐడీ ఐజీ ప్రమోద్‌కుమార్‌ ఆదేశాలతో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సస్పెండ్‌ చేసినట్లు ఆదివారం తెలిపారు. పెద్దవంగర పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రాంచరణ్‌

ప్రేమ పెళ్లి వ్యవహారం.. సర్పంచ్‌ భర్తపై ఎస్సై దాడి.. చివరకు..

సర్పంచ్ భర్తపై దాడి చేసిన ఎస్సై సస్పెన్షన్‌


మహబూబాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఓ సర్పంచ్‌ భర్తపై అకారణంగా దాడి చేసిన ఎస్సైని సీఐడీ ఐజీ ప్రమోద్‌కుమార్‌ ఆదేశాలతో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సస్పెండ్‌ చేసినట్లు ఆదివారం తెలిపారు. పెద్దవంగర పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రాంచరణ్‌ పనిచేస్తున్న సమయంలో ఓ ప్రేమజంట పెళ్లి చేసుకోగా కొంతమంది పెద్దమనుషులు కుల బహిష్కరణ చేశారు. దీంతో సదరు యువకుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మాట్లాడేందుకు సర్పంచ్‌ భర్త వెళ్లాడు. ఈ క్రమంలోనే ఎస్సై, సర్పంచ్‌ భర్తకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్సై రాంచరణ్‌ ఆయనపై చేయి చేసుకోగా గాయమైంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎస్సైని జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్డ్‌ చేశారు. విచారణలో భాగంగా శనివారం సీఐడీ ఐజీ ప్రమోద్‌కుమార్‌ ఎదుట హాజరుపర్చగా ఎస్సైని సస్పెండ్‌ చేయాలని ఎస్పీ కోటిరెడ్డిని ఆదేశించగా ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-07-13T16:37:42+05:30 IST