‌ మెచ్చినవారి మనసు గెలవాలంటే...

ABN , First Publish Date - 2020-06-24T05:45:35+05:30 IST

ఇప్పుడంతా ఆన్‌లైన్‌ డేటింగ్‌. ఒకరితో ఒకరు మాట కలపాలన్నా, మనసు పడాలన్నా అంతా డేటింట్‌ యాప్స్‌ ద్వారా జరిగిపోతున్నాయి.

‌  మెచ్చినవారి  మనసు గెలవాలంటే...

లవ్‌ లైఫ్

ఇప్పుడంతా ఆన్‌లైన్‌ డేటింగ్‌. ఒకరితో ఒకరు మాట కలపాలన్నా, మనసు పడాలన్నా అంతా డేటింట్‌ యాప్స్‌ ద్వారా జరిగిపోతున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో అవతలి వ్యక్తిని ఆకట్టుకోవాలంటే ప్రొఫైల్‌ ఫొటో, చాటింగ్‌ తీరు, మాట్లాడే విధానం... ఇలా అన్నీ బాగుండాలంటారు లవ్‌గురూలు. అప్పుడే మిమ్మల్ని కలిసేందుకు ఎదుటివారు ఆసక్తి చూపిస్తారట! మీరు మనసు పడినవారిని మెప్పించి, మురిపించేందుకు కొన్ని సలహాలు ఇస్తున్నారు. నచ్చితే ఫాలో అయిపోండి... 


ప్రొఫైల్‌: మీకు నచ్చినవి, నచ్చనివి, వ్యక్తిగతంగా మీరు ఎలాంటివారు వంటి విషయాలు ప్రొఫైల్‌లో లేకున్నా పర్లేదు. కానీ చూడగానే చదవాలనిపించేలా, ఆసక్తిగా ఉండాలి. బయో క్లుప్తంగా, అర్థవంతంగా తక్కువ పదాల్లో ఉండాలి. 


ఫొటో: ప్రొఫైల్‌ ఫొటోలో మీ ముఖం ఆకట్టుకునేలా ఉంటేనే అవతలి వ్యక్తి ఛాటింగ్‌ కొనసాగిస్తారు. లేదంటే మొహమాటం లేకుండా నో చెప్పేస్తారు. అలాగనీ ఫొటో కవ్వించేలానో, గంభీరంగానో ఉండకూడదు. 


తొందర వద్దు: డేటింగ్‌ యాప్‌లో కొంత సమయం ఛాటింగ్‌ చేశాక ఎవరో ఒకరు నచ్చుతారు. వెంటనే వారితో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడడం, సందేశాలు పంపడం చేయకూడదు. కవ్వించే, విసిగించే విధంగా ప్రవర్తించ కూడదు. వారితో సన్నిహితంగా మెలిగేందుకు కొంత సమయం తీసుకోండి. తరువాత అన్ని సవ్యంగా జరుగుతాయి. 


స్టాకింగ్‌ సరికాదు: ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కొత్తగా మొదలెట్టారు కాబట్టి మొదట్లో మీ మధ్య సంభాషణ చక్కగా సాగుతుంది. అంతమాత్రాన వారిని సామాజిక మాధ్యమాల్లో విసిగెత్తించేలా పోస్టులు పెట్టడం సరికాదు. అలానే వారి ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వివరాలు అడగడం పద్ధతి కాదు. సోషల్‌ మీడియాలో వారిని స్టాకింగ్‌ చేయడం వల్ల మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొనే అవకాశముంది. దాంతో మీ మీద తప్పుడు అభిపాయ్రం ఏర్పడుతుంది. 


ఆస్వాదించండి: మీరు కొత్తగా డేటింగ్‌ యాప్‌లో చేరి ఉండవచ్చు... లేదా ఆన్‌లైన్‌ డేటింగ్‌లో ఎక్కువగా పాల్గొనేవారు కావచ్చు. ఇలాంటి ప్రతిసారీ సరికొత్త అనుభూతికి లోనవుతారు. దాన్ని పూర్తిగా ఆస్వాదించండి. అయితే అందుకు మీ సమయాన్ని, ఓపికను వెచ్చిస్తే... ఆన్‌లైన్‌ డేటింగ్‌లో ప్రతి క్షణాన్నీ ఆనందించవచ్చు. 

Updated Date - 2020-06-24T05:45:35+05:30 IST