Abn logo
Jul 1 2020 @ 00:02AM

విఫల ప్రేమ కహానీ

ప్రేమ... దూరంగా ఉన్నా దగ్గరవుతుంది. అందినట్టే అంది చేజారిపోతుంది. అలాంటి ఓ ప్రేమకథే ‘నల్లమబ్బుల్లోన’. కథంటే కథ కాదు... కథలాంటి పాట. ఓ పిల్లను ప్రేమించి... ఆమె తలపుల్లోనే జీవించి... చివరకు ఆమె ప్రేమ దక్కక విరహంతో ఓ టీనేజీ కుర్రాడు పడే ప్రణయవేదన ఇది. ఓ విఫల ప్రేమ కహానీ. 


‘నల్ల మబ్బుల్లోన తెల్లంగ మెరిసేటి సందామామా... నా గొంతుకు బిగిసిన ఉరితాడునే తెంపి వెళ్లిపోవమ్మా...’ అంటూ సాగే ఈ ఏడున్నర నిమిషాల వీడియో సాంగ్‌ నెట్టింట నవతరం గుండెల్ని పిండేస్తోంది. డీజే శివ వంగూర్‌ స్ర్కీన్‌ప్లే, దర్శకత్వంలో రూపొందిన ఈ వీడియో యూట్యూబ్‌లో విడుదలైన ఐదు రోజుల్లోనే 25 లక్షలమంది వీక్షించారు. లక్షకు పైగా లైక్స్‌... లెక్కకు మించి కామెంట్స్‌... ఇప్పుడు తెలుగులో టాప్‌-5 వీడియోల్లో ఒకటిగా ట్రెండ్‌ అవుతోంది. 


ఈ పాట రాసింది నవసందీప్‌. పాడింది, విఫల ప్రేమికుడిగా నటించింది కూడా అతనే! అతడితోపాటు లక్కీ హేమ అభినయానికి యూట్యూబ్‌లో ఎంతో మంది అభిమానులైపోయారు. ఎల్‌డీ శివ కెమెరా పనితనం... సినిమాను తలపిస్తుంది. డీజే శివ తన పేరుపైనే పెట్టుకున్న యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా దీన్ని అప్‌లోడ్‌ చేశాడు. ఈ ఛానల్‌కు రెండున్నర లక్షలమంది సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్నారంటే... అతడు ఏ స్థాయిలో అలరిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.


  • ఆల్బమ్‌: నల్లమబ్బుల్లోన...
  • విడుదల: 25 జూన్‌
  • వ్యూస్‌: 2.7 మిలియన్లు

Advertisement
Advertisement
Advertisement