సొంతింటికి ప్రేమజంట

ప్రేమజంట నయనతార, విఘ్నేష్‌ శివన్‌లు నిశ్చితార్థం చేసుకొని ఒకింటివారు అవబోతున్నట్టు ప్రకటించారు. మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న ఈ జంట తమ కలల గృహాన్ని సొంతం చేసుకున్నారని కోలీవుడ్‌ టాక్‌. పెళ్లయ్యాక కాపురం పెట్టేందుకు చెన్నైలోని అత్యంత ఖరీదైన పొయస్‌ గార్డెన్‌ ఏరియాలో ఇల్లు కొన్నారని సమాచారం. త్వరలోనే నయనతార కొత్త ఇంటికి మకాం మార్చనున్నారట. ర జనీ, ధనుష్‌ ఇళ్లకు సమీపంలోనే ఈ ఇల్లు ఉంది. దీనికోసం నయనతార పెద్దమొత్తంలో ఖర్చు పెట్టారట. ప్రస్తుతం నయనతార తెలుగులో చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’, తమిళంలో ‘కాత్తువాక్కుల రెండు కాదల్‌’, ‘కనెక్ట్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Advertisement