బాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్లో క్రేజీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి పీటలు ఎక్కగా.. ఏప్రిల్ 14, 2022న లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వివాహబంధంతో ఒకటయ్యారు. తాజాగా మరో ప్రేమ జంట అర్జున్ కపూర్ (Arjun Kapoor), మలైకా అరోరా (Malaika Arora) పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ కపుల్ రిలేషన్ షిప్లో ఉన్నారు.
అర్జున్ 34వ బర్త్ డే సందర్భంగా 2019లో మలైకాతో ప్రేమ వ్యవహారం గురించి బహిరంగంగా ప్రకటించాడు. అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపిస్తూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభిమానులు సైతం వీరి ప్రేమపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ తరుణంలో ఈ ప్రేమజంట ఈ ఏడాది శీతాకాలంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కరెక్టుగా చెప్పాలంటే.. నవంబర్ చివరిలో గానీ, డిసెంబర్ మొదట్లో గానీ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ వేడుకకి ఈ జంట కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే.. మలైకా అరోరా గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ని పెళ్లి చేసుకోగా వారికి ఓ పిల్లోడు కూడా ఉన్నాడు. అనంతరం అతని నుంచి విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ అర్జున్‌తో రిలేషన్షిప్ కొనసాగిస్తుంది.