Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 18 May 2022 18:00:38 IST

ఆది, నిక్కీ‌ల హల్దీ వేడుకలో స్టెప్పులేసిన Nani, Sandeep Kishan

twitter-iconwatsapp-iconfb-icon
 ఆది, నిక్కీ‌ల హల్దీ వేడుకలో స్టెప్పులేసిన Nani, Sandeep Kishan

టాలీవుడ్ స్టార్ హీరో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty), హీరోయిన్ నిక్కీ గల్రానీని (Nikki Galrani) పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వీరి నిశ్చితార్థం అత్యంత ఘనంగా జరిగింది. మే 18న సాయంత్రం వీరి పెళ్లి జరగనుంది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. ఈ ఫంక్షన్‌కు కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు హాజరుకానున్నారని సమాచారం. తాజాగా ఈ జంట హల్దీ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్‌లో టాలీవుడ్ హీరోలు డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 


ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ హల్దీ వేడుకలో టాలీవుడ్ హీరోలు నాని(Nani), సందీప్ కిషన్ (Sandeep Kishan) స్టెప్పులేశారు. అజిత్ నటించిన ‘వేదళం’(Vedalam) సినిమాలోని పాటకు చిందులేశారు. ఆది పినిశెట్టి కుటుంబసభ్యులతో కలసి తెలుగు హీరోలిద్దరూ సందడి చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆది-నిక్కీలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘యాగవరాయినుం నా కాక్క’ అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం తెలుగులో ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ సినిమా చేస్తున్నప్పుడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇక ఆది కెరీర్ విషయానికీ వస్తే.. ‘సరైనోడు’, ‘నిన్నుకోరి’, ‘రంగస్థలం’, ‘గుడ్ లక్ సఖి’ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement