Love affair: బాపట్ల: దాడికి దారితీసిన ప్రేమ వ్యవహారం

ABN , First Publish Date - 2022-08-05T14:30:18+05:30 IST

బాపట్ల (Bapatla) మండలం, కంకటపాలెంలో ప్రేమ వ్యవహారం (Love affair) దాడికి దారి తీసింది.

Love affair: బాపట్ల: దాడికి దారితీసిన ప్రేమ వ్యవహారం

గుంటూరు (Guntur): బాపట్ల (Bapatla) మండలం, కంకటపాలెంలో ప్రేమ వ్యవహారం (Love affair) దాడికి దారి తీసింది. కంకటపాలెం గ్రామానికి చెందిన ఆనంద్, దివ్యల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య కుటుంబ సభ్యులు ఆనంద్ ఇంటిపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-05T14:30:18+05:30 IST