జోరుగా నకిలీ విత్తనాల దందా!

ABN , First Publish Date - 2022-06-27T05:43:34+05:30 IST

వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులకు నకిలీ విత్తనాల ముప్పు పొంచి ఉన్నది. ఇప్పటికే దుక్కి దున్ని విత్తనాల వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. గత సీజన్‌లో పత్తికి రికార్డు స్థాయిలో ధర లభించడంతో ఈ సారి సాగు విస్తీర్ణం పెరగనుంది. జిల్లాలో ప్రతీ మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన అధిక సాంద్రత కలిగిన పత్తి విత్తనాల సాగుపై వ్యవసాయాధికారులు నిమగ్నమయ్యారు. దీంతో నిషేధిత పత్తి విత్తనాల సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించడంలో వారు విఫలమవుతున్నారు.

జోరుగా నకిలీ విత్తనాల దందా!
అక్కన్నపేట మండలంలోని ఓ గ్రామంలో రైతు కొనుగోలు చేసిన పత్తి విత్తన ప్యాకెట్లు


గ్రామాల్లో పత్తి రైతులకు దళారుల వల

ఇతర రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా బీటీ-3 విత్తనాల దిగుమతి


అక్కన్నపేట, జూన్‌ 26 : వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులకు నకిలీ విత్తనాల ముప్పు పొంచి ఉన్నది. ఇప్పటికే దుక్కి దున్ని విత్తనాల వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. గత సీజన్‌లో పత్తికి రికార్డు స్థాయిలో ధర లభించడంతో ఈ సారి సాగు విస్తీర్ణం పెరగనుంది. జిల్లాలో ప్రతీ మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన అధిక సాంద్రత కలిగిన పత్తి విత్తనాల సాగుపై వ్యవసాయాధికారులు నిమగ్నమయ్యారు. దీంతో నిషేధిత పత్తి విత్తనాల సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించడంలో వారు విఫలమవుతున్నారు.  పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలపై దృష్టి సారించడం లేదు. ఇదే అదనుగా స్థానికంగా సీడ్‌ వ్యాపారం చేసే ఆర్గనైజర్లు నకిలీ విత్తనాల దందాకు తెర లేపుతున్నారు. సీడ్‌ సంస్థలతో వారికున్న పరిచయాలతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ఏలూరు, కర్నూలు జిల్లాల నుంచి పత్తి విత్తనాలను దిగుమతి చేసుకుంటున్నారు. గ్రామానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఏజెంట్లను నియమించుకొని అమాయకపు రైతులకు అంటగడుతున్నారు. ఏజెంట్లు గ్రామాల్లో రైతులతో ఉన్న పరిచయాలతో మాయమాటలు చెబుతూ పంట దిగుబడి భారీగా వస్తుందని ఆశ చూపి నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు.  హుస్నాబాద్‌ డివిజన్‌లోని అక్కన్నపేట, హుస్నాబాద్‌, కోహెడ మండలాల్లో నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతోంది. అధిక దిగుబడిపై ఆశతో రైతులు బీటీ-3 విత్తనాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రామాల్లో నకిలీ విత్తనాలను డంపు చేసిన దళారులు రైతులకు అవసరం ఉన్నప్పుడు అధికారుల కళ్లుగప్పి ఈ ప్యాకెట్లను వారికి చేరవేస్తున్నారు. ఒక్కొక్క పత్తి విత్తన ప్యాకెట్‌ను రూ.600 నుంచి రూ.750 చొప్పున విక్రయిస్తున్నారు.్ఝ


నకిలీ విత్తనాలు విక్రయించే ఏజెంట్ల సమాచారం ఇవ్వాలి

గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ విత్తనాలు విక్రయించే ఏజెంట్ల సమాచారాన్ని వ్యవసాయ అధికారులతో పాటు పోలీసులకు అందించాలి. పోలీసులు, వ్యవసాయ అధికారులతో విజిలెన్స్‌ కమిటీ ఫర్టిలైజర్‌, సీడ్స్‌ షాపులతో పాటు గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తాం. నకిలీ విత్తనాలు, నిషేధిత పెస్టిసైడ్స్‌ రైతులకు విక్రయించే వారిపై దృష్టి పెడతాం.

-పులి బోగేశ్వర్‌, మండల ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి, అక్కన్నపేట

Updated Date - 2022-06-27T05:43:34+05:30 IST