Abn logo
Jun 18 2021 @ 00:11AM

సీసీఆర్‌సీతో ప్రయోజనాలు మెండు

రాజానగరం: వెలుగుబంద సదస్సులో మాట్లాడుతున్న బాలసుబ్రహ్మణ్యం

రాజానగరం, జూన్‌ 17: పంట సాగుదారు హక్కు పత్రం (సీసీఆర్‌సీ)తో అనేక ప్రయోజనాలు పొందవచ్చని తహశీల్దార్‌ జి.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. జిల్లాలో పలుచోట్ల కౌలు రైతుల అవగాహన సదస్సులు గురువారం జరిగాయి. రాజానగరం మండలంలో వెలుగుబంద, చక్రద్వారబంధం గ్రామాల్లో నిర్వహిం చారు. వెలుగుబంద సదస్సులో తహశీల్దార్‌ మాట్లాడుతూ సాగు హక్కు పత్రాలను, రైతు భరోసా కేంద్రాలు ద్వారా అందిస్తున్న సేవలను కౌలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని కౌలు రైతులకు మంజూరు చేసిన సీసీఆర్‌సీ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి పల్లా సురేష్‌, నాయకులు వాడ్రేవు శ్రీనివాసకుమార్‌, సోడసాని తాతబ్బాయి, కూటి ప్రసాద్‌, రైతులు పాల్గొన్నారు.